AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack at Younger Age: చిన్న వయసులోనే గుండె పోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!

నేటి కాలంలో గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తనాళాల అడ్డంకులు, గుండె స్పందన రేటులో హెచ్చుతగ్గులు కూడా వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ కనిపిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి..

Heart Attack at Younger Age: చిన్న వయసులోనే గుండె పోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!
How To Protect Heart At Young Age
Srilakshmi C
|

Updated on: Apr 06, 2026 | 9:15 PM

Share

ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులలోనే కాకుండా యువతలోనూ సంభవిస్తున్నాయి. దీనికి తోడు గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తనాళాల అడ్డంకులు, గుండె స్పందన రేటులో హెచ్చుతగ్గులు కూడా వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ కనిపిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఎక్కువసేపు పనిచేసేవారు, నిరంతరం ఒత్తిడికి లోనయ్యేవారు, కుటుంబంలో గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం కాస్త ఎక్కువగా ఉంటుంది. యువతలో పెరుగుతున్న ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అసలు దీనికి కారణమేమిటి, లక్షణాలు ఏమిటో తెలుసుకుని, ఈ సమస్య పెరగకుండా నివారించడం ఎలాగో నిపుణుల మాటల్లో మీ కోసం..

చిన్న వయసులో గుండెపోటు రావడానికి కారణాలు

  • ఎక్కువ సేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం
  • జంక్ ఫుడ్, అధిక నూనె గల ఆహార పదార్థాల వినియోగం
  • నిద్రలేమి, రాత్రిపూట ఆలస్యంగా మేల్కొని ఉండటం
  • నిరంతర ఒత్తిడి, కోపం, మానసిక ఉద్రిక్తత
  • ధూమపానం, మద్యం సేవించడం

గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు

  • ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి
  • చేయి, మెడ లేదా వీపులో నొప్పి
  • శ్వాస ఆడకపోవడం
  • అకస్మాత్తుగా అధికంగా చెమట పట్టడం
  • తలతిరగడం, బలహీనత
  • వాంతులు

ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం.
  • ప్రతిరోజూ వ్యాయామం చేయడం, నడవడం అలవాటు చేసుకోవడం.
  • సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
  • జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండటం.
  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం.
  • బాగా నిద్రపోవడం.
  • క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్