AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!

D-Mart: ఒక చిన్న కిరాణా దుకాణంలా మొదలై, నేడు భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ సామ్రాజ్యాల్లో ఒకటిగా ఎదగడానికి కారణం రాధాకిషన్ దమానీ క్రమశిక్షణతో కూడిన వ్యాపార శైలి, కస్టమర్లకు "తక్కువ ధర" అనే నమ్మకాన్ని కలిగించడం. అయితే డీమార్ట్ కువెళ్లే వాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..

D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!
D Mart
Subhash Goud
|

Updated on: Apr 06, 2026 | 9:08 PM

Share

D-Mart: భారతదేశంలో రిటైల్ రంగం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు డీమార్ట్ (D-Mart). సామాన్యుడికి తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను అందిస్తూ అంచలంచెలుగా ఎదిగిన ఈ సంస్థ. తాజాగా ఒక భారీ మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా తన 500వ స్టోర్‌ను ప్రారంభించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

24 ఏళ్ల అద్భుత ప్రస్థానం

అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీ కింద ప్రముఖ వ్యాపారవేత్త రాధాకిషన్ దమానీ 2002లో ముంబైలోని పొవాయ్‌లో మొదటి డీమార్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. కేవలం ఒకే ఒక స్టోర్‌తో మొదలైన ఈ ప్రయాణం.. ఇప్పుడు 500 స్టోర్లకు చేరుకోవడం విశేషం. ఈ 24 ఏళ్ల కాలంలో డీమార్ట్ తన వినియోగదారుల నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోకుండా నిలకడగా వృద్ధి చెందుతూ వచ్చింది.

  • విజయ రహస్యం: తక్కువ ధర – ఎక్కువ ఆదా:

డీమార్ట్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం వారి ‘లో కాస్ట్’ మోడల్.

  • భారీ డిస్కౌంట్లు: ఎంఆర్‌పి (MRP) కంటే తక్కువ ధరకే వస్తువులను విక్రయించడం డీమార్ట్ ప్రత్యేకత.
  • స్వంత ప్రాంగణాలు: చాలా వరకు స్టోర్లను అద్దెకు తీసుకోకుండా, సొంతంగా కొనుగోలు చేయడం వల్ల అద్దె ఖర్చులు తగ్గి ఆ లాభాన్ని కస్టమర్లకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తారు.
  • పేమెంట్ సిస్టమ్: సప్లయర్లకు వెంటనే నగదు చెల్లించడం ద్వారా వారి వద్ద నుండి తక్కువ ధరకు సరుకులను సేకరిస్తారు.
  • విస్తరణ, ఉపాధి: మహారాష్ట్రలో ప్రారంభమైన డీమార్ట్, ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో విస్తరించింది. 500 స్టోర్ల మైలురాయిని చేరుకోవడం ద్వారా వేలాది మందికి నేరుగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

ఇది కూడా చదవండి: Onion: వంటింట్లో అతిపెద్ద సమస్యకు చెక్! ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇక కన్నీళ్లు అస్సలు రావు

భవిష్యత్తు ప్రణాళికలు:

కేవలం ఫిజికల్ స్టోర్స్ మాత్రమే కాకుండా, ‘డీమార్ట్ రెడీ’ (D-Mart Ready) ద్వారా ఆన్‌లైన్ రంగంలో కూడా తన ముద్ర వేస్తోంది. రాబోయే రోజుల్లో టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా భారీగా స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఒక చిన్న కిరాణా దుకాణంలా మొదలై, నేడు భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ సామ్రాజ్యాల్లో ఒకటిగా ఎదగడానికి కారణం రాధాకిషన్ దమానీ క్రమశిక్షణతో కూడిన వ్యాపార శైలి, కస్టమర్లకు “తక్కువ ధర” అనే నమ్మకాన్ని కలిగించడం.

ఇది కూడా చదవండి: Gold Price: శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!

డీ-మార్ట్ ఒకేసారి దేశమంతా స్టోర్లు తెరవదు. మొదట ఒక ప్రాంతాన్ని (ఉదాహరణకు ముంబై లేదా హైదరాబాద్) ఎంచుకుని, అక్కడ ఒక స్టోర్ విజయవంతం అయ్యాక, దానికి దగ్గరలోనే మరిన్ని స్టోర్లు తెరుస్తుంది. దీనివల్ల ట్రాన్స్‌పోర్ట్, సప్లై చైన్ ఖర్చులు బాగా తగ్గుతాయి. అలాగే సేల్ ముఖ్యం: ఇతర సూపర్ మార్కెట్లు కంపెనీల నుండి “షెల్ఫ్ స్పేస్” (వస్తువులను ముందు ఉంచడానికి) కోసం డబ్బులు తీసుకుంటాయి. కానీ డీ-మార్ట్ అలాంటివి తీసుకోదు. ఏ వస్తువు కస్టమర్లకు తక్కువ ధరకు వస్తుందో, ఏది ఎక్కువగా అమ్ముడవుతుందో దానికే ప్రాధాన్యత ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Multibagger: రూ.1 లక్ష రూ.4 కోట్లుగా మార్చింది.. తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం‌!

ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో రూ. 4 లక్షల డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి ఎంత వస్తుంది?

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us