AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: రూ.1 లక్ష రూ.4 కోట్లుగా మార్చింది.. తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం‌!

Multibagger Stock: ఈ షేరు కేవలం లాంగ్ టర్మ్‌లో మాత్రమే కాకుండా, షార్ట్ టర్మ్‌లో కూడా అద్భుతాలు సృష్టించింది. గత ఏడాది కాలంలోనే ఈ స్టాక్ ఏకంగా 1283 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఏడాది క్రితం పెట్టిన రూ. 1 లక్ష..

Multibagger: రూ.1 లక్ష రూ.4 కోట్లుగా మార్చింది.. తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం‌!
Multibagger Stock
Subhash Goud
|

Updated on: Apr 06, 2026 | 4:28 PM

Share

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్న పని అని అందరూ అంటుంటారు. కానీ, సరైన సమయంలో సరైన షేరును ఎంచుకుంటే అది రాత్రికి రాత్రే మన తలరాతను మార్చేస్తుందని ఈ ‘మిడ్‌వెస్ట్ గోల్డ్ లిమిటెడ్’ (Midwest Gold Ltd) షేరు నిరూపించింది. గత ఐదేళ్లలో ఈ షేరు ఇచ్చిన రిటర్న్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

రూ. 11 నుండి రూ. 4600 పైకి..

ఒకప్పుడు కేవలం రూ. 11 వద్ద ఉన్న ఈ షేరు విలువ ప్రస్తుతం రూ. 4600 మార్కును దాటేసింది. గడిచిన ఐదేళ్ల కాలాన్ని గమనిస్తే ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలను పంచిపెట్టింది.

లక్ష పెట్టుబడి.. కోట్ల లాభం: ఐదేళ్ల క్రితం ఎవరైనా ఈ కంపెనీలో రూ. 1,00,000 పెట్టుబడి పెట్టి, వాటిని ఇప్పటివరకు అలాగే ఉంచుకుని ఉంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ఆ పెట్టుబడి విలువ అక్షరాలా రూ. 4,25,37,000 అయ్యేది. అంటే సదరు ఇన్వెస్టర్ కేవలం ఐదేళ్లలోనే కోటీశ్వరుల జాబితాలోకి చేరిపోయేవారు.

ఇవి కూడా చదవండి

ఒక్క ఏడాదిలోనే 13 రెట్లు

ఈ షేరు కేవలం లాంగ్ టర్మ్‌లో మాత్రమే కాకుండా, షార్ట్ టర్మ్‌లో కూడా అద్భుతాలు సృష్టించింది. గత ఏడాది కాలంలోనే ఈ స్టాక్ ఏకంగా 1283 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఏడాది క్రితం పెట్టిన రూ. 1 లక్ష ఇప్పుడు రూ. 13,83,000 కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, గత ఆరు నెలల్లోనే ఈ షేరు 83 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ఇది కూడా చదవండి: Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!

కంపెనీ నేపథ్యం ఏమిటి?

మిడ్‌వెస్ట్ గోల్డ్ లిమిటెడ్ ప్రస్థానం 1990లో ‘నోవా గ్రానైట్ ఇండియా లిమిటెడ్’ పేరుతో ప్రారంభమైంది. తొలుత గ్రానైట్ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ, ఆ తర్వాత విలువైన లోహాల మైనింగ్ (Mining), రిఫైనింగ్ రంగాల్లోకి ప్రవేశించింది. 2010లో కంపెనీ పేరును ప్రస్తుతమున్న ‘మిడ్‌వెస్ట్ గోల్డ్’గా మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ (Market Cap) సుమారు రూ. 6,040 కోట్లుగా ఉంది.

గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ నష్టభయాలకు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న సమాచారం కేవలం వార్తా విశ్లేషణ మాత్రమే. మీరు ఏదైనా షేరులో పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోగలరు.

ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో రూ. 4 లక్షల డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి ఎంత వస్తుంది?

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!