బాస్‌తో అదిరిపోయే మూవీ తీయ్‌

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోమవారం 54వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే

  • Manju Sandulo
  • Publish Date - 1:20 pm, Tue, 29 September 20

Puri Jagannadh comment: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోమవారం 54వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలను వెల్లడించారు. ఇలానే సినిమాలు తీస్తూ మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలంటూ అందరూ కామెంట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ పూరీకి విష్ చేస్తూ.. ”నా ఫేవరెట్ పర్సన్ పూరీ జగన్నాథ్‌ సర్‌కి హ్యాపీ బర్త్‌డే. మీ నవ్వు, మీరు పోరాట స్ఫూర్తి నాలాంటి ఎంతో మందికి స్పూర్తి. లవ్‌ యు సర్‌” అంటూ కామెంట్‌ పెట్టారు.

అందుకు స్పందించిన పూరీ.. ”థ్యాంక్స్‌ బాబీ. నిన్ను మిస్ అవుతున్నా. బాస్‌తో అదిరిపోయే సినిమా తీయ్‌. త్వరలో నిన్ను చూస్తాను” అని ట్వీట్ చేశారు. అయితే బాబీ తనతో ఓ సినిమాను తీయాలనుకుంటున్నాడని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా రెడీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్‌ తరువాత చిరు-బాబీ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:

లెక్చరర్‌గా పవన్‌ కల్యాణ్‌..!

నానితో రెండోసారి రొమాన్స్‌..!