లెక్చరర్‌గా పవన్‌ కల్యాణ్‌..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన పంథాను మార్చారు. ఒకప్పుడు కమర్షియల్, లవ్‌ పాత్రలకే మక్కువ చూపిన పవన్.. ఇప్పుడు ఇంతవరకు నటించని పాత్రల్లో

  • Manju Sandulo
  • Publish Date - 12:47 pm, Tue, 29 September 20

Pawan Kalyan lecturer: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన పంథాను మార్చారు. ఒకప్పుడు కమర్షియల్, లవ్‌ పాత్రలకే మక్కువ చూపిన పవన్.. ఇప్పుడు ఇంతవరకు నటించని పాత్రల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో వకీల్ సాబ్‌లో లాయర్‌గా, క్రిష్ మూవీలో బందీపోటుగా కనిపించనున్నారు. ఇక హరీష్ శంకర్ తెరకెక్కించే చిత్రంలో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెలలో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేయగా.. అందులో బైక్‌, ఇండియా గేట్‌, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోలను ఉంచారు. ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే పవన్‌.. సామాజిక సమస్యలపై ఎలా పోరడతాడు..? అన్న కోణంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇందులో ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉందనుందని, అందులో పవన్ పోలీస్‌గా కనిపించనున్నాడని టాక్‌. చూస్తుంటే ఈ కథ చిరంజీవి నటించిన మాస్టర్, ఠాగూర్‌లను పోలీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? పవన్‌ని హరీష్‌ ఎలా చూపించబోతున్నాడు..? ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు భాగం అవ్వబోతున్నారు.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న విషయం తెలిసిందే.

Read More:

నానితో రెండోసారి రొమాన్స్‌..!

తిరుమలలో శాస్త్రోక్తంగా షోడశదిన సుందరకాండ దీక్ష ప్రారంభం