కబీర్ సింగ్ టాక్ ఏంటి..!
విజయ్ దేవరకొండకు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన చిత్రం… అర్జున్‌రెడ్డి. పెళ్లి చూపులు సినిమాతోనే అందర్నీ ఇంప్రెస్ చేశాడు. కానీ నటుడిగా అతనిలో ఇంటెన్సిటీ ఏంటనేది అర్జున్‌రెడ్డిలో చూశాం. అందుకే యూత్‌కి అంతగా నచ్చాడు విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమాలో కథ, కథనాల కన్నా టైటిల్ రోల్‌లో విజయ్ దేవరకొండ నటనే ఎక్కువగా ఇంప్రెస్ చేసింది. అలాంటి పాత్రని వేరే నటుడి మళ్ళీ చేసి మెప్పించాలంటే కష్టం. అర్జున్‌రెడ్డి సినిమాతో సందీప్ వంగా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సందీప్ […]

విజయ్ దేవరకొండకు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన చిత్రం… అర్జున్‌రెడ్డి. పెళ్లి చూపులు సినిమాతోనే అందర్నీ ఇంప్రెస్ చేశాడు. కానీ నటుడిగా అతనిలో ఇంటెన్సిటీ ఏంటనేది అర్జున్‌రెడ్డిలో చూశాం. అందుకే యూత్‌కి అంతగా నచ్చాడు విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమాలో కథ, కథనాల కన్నా టైటిల్ రోల్‌లో విజయ్ దేవరకొండ నటనే ఎక్కువగా ఇంప్రెస్ చేసింది. అలాంటి పాత్రని వేరే నటుడి మళ్ళీ చేసి మెప్పించాలంటే కష్టం.
అర్జున్‌రెడ్డి సినిమాతో సందీప్ వంగా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సందీప్ వంగా తన తొలి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. అది ఈ శుక్రవారం విడుదలైంది. కబీర్ సింగ్‌కి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అర్జున్‌రెడ్డి సినిమాకి మక్కీకి మక్కీ రీమేక్ చేశాడట సందీప్. అంటే ఇక్కడ ఏదైనా సీన్‌లో పువ్వు ఊగితే.. అక్కడ కూడా పువ్వు ఊగడం అన్నమాట. ఆ రేంజ్‌లో జిరాక్స్ కాపీలా దించేశాడట దర్శకుడు.
అర్జున్‌రెడ్డి ఒరిజినల్ సినిమా చూడని వారికి ఫ్రెష్ అనిపించినట్లుంది కబీర్ సింగ్. అందుకే కొందరు క్రిటిక్స్ మంచి రేటింగ్ ఇచ్చారు. దానికి తోడు విజయ్ దేవరకొండలా షాహిద్ కపూర్ లేడనేది అందరి మాట. ఎందుకంటే షాహిద్ కపూర్‌కు ఏజ్ ఇప్పుడు 38 ఏళ్ళు. విజయ్ దేవరకొండ ఈ పాత్ర చేసినప్పుడు పాతికేళ్ల వయసులో ఉన్నాడు. దాంతో షాహిద్ ఆ పాత్రలో కన్విన్సింగ్‌గా లేడనేది విమర్శకుల మాట.
కబీర్ సింగ్ విడుదలైన తర్వాత అందరూ విజయ్ దేవరకొండ నటనని పొగడడం విశేషం. షాహిద్ కపూర్ కూడా మంచి నటుడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించాడు. ఐతే విజయ్ దేవరకొండతో కంపేరిజన్ వల్ల అతనికి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
