AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota Srinivasa Rao: అరె.. కోట శ్రీనివాసరావుకు ఏమైంది? ఇలా గుర్తుపట్టలేకుండా మారిపోయారు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సుమారు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడటంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కెమెరా ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు కోట శ్రీనివాసరావు బాగా బక్కచిక్కిపోయి గుర్తు పట్టలేకుండా మారిపోయారు.

Kota Srinivasa Rao: అరె.. కోట శ్రీనివాసరావుకు ఏమైంది? ఇలా గుర్తుపట్టలేకుండా మారిపోయారు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Kota Srinivasa Rao
Basha Shek
|

Updated on: Jun 10, 2025 | 7:39 PM

Share

నటుడిగా, విలన్ గా, కమెడియన్‌గా వందలాది సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. తన అద్బుత అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం 2023 వరకు అప్రతిహతంగా కొనసాగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ నటించి మెప్పించారు కోట. సుమారు 750 కు పైగా సినిమాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు తన అభినయ ప్రతిభకు ఏకంగా తొమ్మిది నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటారాయన. 1999 నుండి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. కాగా గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కోట. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన చివరగా 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ మూవీలో కనిపించారు. ఆ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించలేదీ సీనియర్ నటుడు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు.

‘కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కోట ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫొటోల్లో కోట శ్రీనివాసరావు పూర్తిగా బక్కచిక్కిపోయి కనిపించారు. అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయారు. పైగా పాదానికి కట్టుతోనూ కనిపించారు. దీంతో కోటాకు ఏమైందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

 నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తో కోట శ్రీనివాసరావు..

కోటా శ్రీనివాసరావు గారి అనారోగ్య సమస్యలు ఏంటి అనే విషయంపై క్లారిటీ లేదు కానీ ఆయన మాత్రం క్షేమంగా ఉండాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

కాలికి కట్టుతో నటుడు కోట శ్రీనివాసరావు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు