Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి ప్రస్తుతం మరో ఇండస్ట్రీ రికార్డు కొట్టే పనిలో ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో రానున్న రాజమౌళి ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై మరోసారి గురి పెడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే రాజమౌళి మరో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఈ విషయమై రాజమౌళి తన తర్వాతి చిత్రం మహేష్ బాబుతో ఉండనుందని స్ఫష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తవుతున్న నేపథ్యంలో రాజమౌళి తర్వాతి చిత్రంపై ఇప్పటి నంచే రూమర్లు రావడం మొదలైంది. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ శివాజీ పాత్రలో నటిస్తాడని ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేసింది. ఆతర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ కోసం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఓ కథను సిద్ధం చేసారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో రూమర్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ప్రాజెక్ట్ ని ఈ ఏడాది విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని.. ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని అంటున్నారు. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా 2023 సంక్రాంతికి విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈవార్తలపై జక్కనే క్లారిటీ ఇవ్వాలి. ఏదిఏమైనా రాజమౌళితో మహేష్ సినిమా అని తెలిసిన దగ్గరనుంచి అభిమానులంతా ఆనందంలో తేలిపోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :