AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలకు తప్పని కరోనా కష్టాలు… షూటింగ్స్ పై కోవిడ్ ఎఫెక్ట్..

కరోనా సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల 2 లక్షలకు పైగా నమోదవుతుండడం

'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలకు తప్పని కరోనా కష్టాలు... షూటింగ్స్ పై కోవిడ్ ఎఫెక్ట్..
Rrr Acharya Movies
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2021 | 8:11 AM

Share

కరోనా సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల 2 లక్షలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ మహమ్మారి భారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కట్టిడికి రాష్ట్రాలు ఎంత గట్టి చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే.. రెట్టింపు వేగంతో కరోనా వ్యాప్తి అవుతోంది. దీంతో పలు రాష్ట్రాలు స్వయం లాక్ డౌన్ విధించుకుంటుండగా.. మరికొన్ని రాష్ట్రాలు రాత్రి కర్య్ఫు పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక ఈ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై పడింది.

ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సినీ పరిశ్రమను కరోనా మరోసారి చిన్నాభిన్నం చేస్తుంది. ఇటీవల క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమాలతో జోష్ మీదున్న దర్శకనిర్మాతలకు కరోనా మళ్లీ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి భారిన పడగా.. కొన్ని సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఇప్పటికే కరోనా వ్యాప్తి కారణంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’.. నాగచైతన్య నటిస్తున్న థ్యాంక్యూ, గోపిచంద్-మారుతి సినిమాలు తమ షూటింగ్‌లను వాయిదా వేసుకన్నాయి. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళీ రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు కూడా చేరాయి. చిత్రయూనిట్ లో ఒకరికి కరోనా సోకగా.. మరింత ఆలస్యం చేయకుండా.. షూటింగ్‌ను నిలిపివేస్తే బాగుంటుందని నిర్మాతలతో పాటు రాజమౌళి కూడా భావించారట. అందుకోసం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఆచార్య సెట్‌లోనూ మహమ్మారి ప్రభావం గట్టిగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ని కూడా నిలిపివేశారని తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గి పరిస్థితులు కాస్త మెరుగైన తర్వాత మళ్లీ ఈ షూటింగ్‌లు ప్రారంభించే యోచనలో చిత్ర యూనిట్‌లు ఉన్నాయట.

Also Read: స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..