Ravi Teja: ఫుల్ ,జోష్ లో మాస్ రాజా రవితేజ.. నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా..
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవలే క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ . ఇప్పుడు ఖిలాడి గా రాబోతున్నాడు.
Ravi Teja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవలే క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ . ఇప్పుడు ఖిలాడి గా రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మ ఇటీవల రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించారు. ఈ సినిమాతర్వాత రవితేజ మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా రవితేజ మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్. త్వరలో రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం హరీష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రవితేజతో సినిమా ఉండబోతుందని అంటున్నారు. రవితేజ నటించిన షాక్ సినిమాతో హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత వెంటనే మిరపకాయ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నుఅందుకుంది. హరీష్ శంకర్.. ఇటీవలే రవితేజను కలిసి కథ వినిపించాడట. దీనికి రవితేజ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. ఇది మాస్ రాజా శైలికి తగ్గుట్టు ఎంటర్టైన్మెంట్ తో పాటు కమర్షియల్ హంగులు జత చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
21 Years for Badri: పవన్ కళ్యాణ్ బద్రికి 21 సంవత్సరాలు.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న డైలాగ్స్..
ముంబై విమానాశ్రయంలో ప్రత్యక్షమైన.. అనుష్క శర్మ.. తోడుగా వామిక కూడా ఉందిగా.. ఫోటోస్ వైరల్ ..
కరోనా బారిన పడ్డ జబర్దస్త్ బ్యూటీ.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటూ ఎమోషనల్….