Karthika Deepam : దీప కు ఎవరో రాంగ్ డ్రగ్ ఇచ్చారని తెలుసుకున్న కార్తీక్.. డాక్టర్ బాబు ప్రేమ నిజమేనాఅని ఆలోచిస్తున్న దీప
Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1018వ ఎపిసోడ్ లో అడుగుపెట్టింది. దీప కార్తీక్ లు వెన్నెల్లో అన్నంతింటుంటే.. పిల్లలు సంతోషంగా..
Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1018వ ఎపిసోడ్ లో అడుగుపెట్టింది. దీప కార్తీక్ లు వెన్నెల్లో అన్నంతింటుంటే.. పిల్లలు సంతోషంగా వడ్డించడంతో మొదలవుతుంది ఈరోజు ఎపిసోడ్.. మరి ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం..!
దీపకార్తీక్ లు కలిసి భోజనం చేయడం చూసి ఆనందరావు సౌందర్య దంపతులు ఆనందిస్తారు. భాగ్యం మురళీ కృష్ణతో శ్రీరామ నవమి రోజున కూతుర్లు, అల్లుళ్లతో కలిసి సీతారామ కళ్యాణం చేయిద్దామని అంటుంది. నేను వెళ్ళి.. కూతుర్లను అల్లుళ్లను పిలుస్తాను.. మీరు సరుకులు తీసుకుని రమ్మనమని చెబుతుంది భాగ్యం..
మోనిత కాఫీమీద కాఫీ తాగుతూ.. దీపకి ఫోన్ చేయాలని ఆలోచిస్తుంది..
సౌందర్య దగ్గరకి వచ్చిన భాగ్యం ‘శ్రీరామనవమికి.. ఇద్దరూ అల్లుళ్లు, ఇద్దరూ కూతుర్లు పీటల మీద కూర్చుని పూజ చేయించాలనుకుంటున్నాను వదిన అంటుంది. దీపని, శ్రావ్యని, పిల్లల్ని ఈ రోజే తీసుకుని వెళ్ళతాను రేపు మీరు రండి అని చెబుతుంది ఇంతలో కార్తీక్ శ్రావ్యని పిల్లలని తీసుకుని వెళ్ళండి… దీప రాదు అంటాడు.. అక్కడికి వెళ్తే.. మళ్ళీ వంటలక్కలా మారి మళ్ళీ వంటలు చేస్తుంది.. దీప కండిషన్ మీకు ఏమి తెలుసు అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
దీప తన రూమ్‌లో కార్తీక్ ప్రవర్తన గురించి ఆలోచించుకుంటూ ఉండగా.. మోనిత కాల్ చేస్తుంది. . ఆరోగ్యం గురించి ఆరాతీస్తోంది. జాగ్రత్తగా ఉండు.. హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ .. కార్తీక్ తో నీ ఆరోగ్యం గురించి చెప్పమని చెబుతూనే ఉంటా.. అని అంటుంటే.. దీప కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. దీంతో ఎలాగో నువ్వు పోయేదానివి.. నాకు అడ్డురావు .. మీ ఇద్దరి మధ్య సంఖ్యత కుదరకుండా నేను ఎలాగా నా ప్రయత్నం నేను చేస్తా.. సరోవరంలో అప్పుడప్పుడు ఓ గులకరాయి వేస్తుంటాను.. ఆటోమెటిక్‌గా కార్తీక్ నాకు దగ్గర అయ్యేలా చేసుకుంటాను అంటూ మోనిత తనదైన శైలిలో ఆలోచిస్తుంది.
మరోవైపు సౌందర్య, ఆనందరావులు కార్తీక్ ప్రవర్తన గురించి చర్చించుకుంటారు. ఇంతలో పిల్లలు దీప అక్కడికి వస్తారు.. నాన్నమ్మా.. ఇందాక అమ్మ సెల్ గేమ్ ఆడటానికి తీసుకుంటే మోనిత ఫోన్ చేసినట్లుంది అంటుంది శౌర్య.. సౌందర్య మోనిత గురించి మాట్లాడబోతుంటే.. పిల్లలున్నారు అని సైగ చేస్తుంది. పిల్లల్ని దీపుగాడితో ఆడుకోండి అని పంపించి.. సౌందర్య మోనిత ఫోన్ కాల్ గురించి అడుగుతుంది. మోనిత నా అనారోగ్యం గురించి ఆరాతీసింది. బయటకు వెళ్లొద్దు అని చెప్పింది అంటుంది దీప.. కార్తీక్ ఇంకా మోనిత మాటనే వింటున్నాడు.. అందుకనే దీపని పుట్టింటికి పంపించను అన్నాడు అంటుంది సౌందర్య.
లాభం లేదండీ.. దీపని, శ్రావ్యని, పిల్లల్ని ఇవాళే భాగ్యం ఇంటికి పంపించేసి.. వాడ్ని నిలదీస్తాను..’అంటుంది సౌందర్య. దీప బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక నుంచి మనం కొన్ని విషయాలను దీప ముందు చర్చించకూడదు అని అనుకుంటారు ఆనందరావు సౌదర్యలు
మోనిత టానిక్ వేసుకుంటే కార్తీక్ వస్తాడు.. ఏమిటి అని ఆరా తీస్తే.. డాక్టర్ భారతి తనకు ఒక షాకింగ్ విషయం చెప్పిందని అంటాడు ఏమిటంటే.. అసలు దీపకు అలా కావడానికి కారణం ఆమె శరీరంలోని ఏదో రాంగ్ డ్రగ్ ఇంజెక్ట్ చెయ్యడం వల్లేనట.. అంటాడు కార్తీక్. దీంతో మోనిత షాక్ తింటుంది.. తాను గతంలో చేసిన ఇంజెక్షన్ గుర్తు చేసుకుని.. ఒకవేళ ఇదే విషయం దీపని అడిగితె.. తను నా దీంతో మోనిత దీప హెల్త్ పాడు కావడానికి కారణం వంట చేస్తూ.. పొయ్యి దగ్గర ఉండిపోవడమే అంటుంది. ఏ డ్రగ్ కారణం అయ్యి ఉండదు.. మనం జాగ్రత్తగా ట్రీట్ చేద్దాం.. నువ్వు ధైర్యంగా ఉండు అని మళ్ళీ తనదైన శైలీలో మాట మారుస్తుంది.
సౌందర్య ఇంట్లో కార్తీక్‌ని.. భాగ్యం ఇంటికి తీసుకుని వెల్లేందుకు ఆలోచిస్తుంటారు.. హిమ, శౌర్యలు డాడీ రాకుండా మేము వెళ్లం’ అంటూ ఉండగా.. కార్తీక్ ఇంటికి వస్తాడు… అసలే కార్తీక్ గురుంచి ఆలోచిస్తున్న దీపకు అసలు నిజం తెలుస్తుందా.. మోనిత గుట్టు రట్టు అవుతుందా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి మరి
Also Read: పర్యావరణ రక్షణ కోసం ఓ సంస్థ నయా సృష్టి.. మొలకెత్తే మాస్కుల తయారీ.. ఎక్కడంటే