Renowned Music Director: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.. శోకసంద్రంలో మలయాళ సినీ పరిశ్రమ
ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు కెజె జాయ్ (77) కన్నుమూశారు. 80లలో మలయాళ చిత్ర ప్రరిశ్రమలో ఎన్నో విజయాలను అందించిన జాయ్ అనారోగ్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం క్రితం స్ట్రోక్‌కు గురైన ఆయన పక్షవాతం రావడంతో మంచం పట్టారు. ఈక్రమంలో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన దాదాపు 200 చిత్రాలకుపైగా సంగీతం అందించారు..
ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు కెజె జాయ్ (77) కన్నుమూశారు. 80లలో మలయాళ చిత్ర ప్రరిశ్రమలో ఎన్నో విజయాలను అందించిన జాయ్ అనారోగ్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం క్రితం స్ట్రోక్‌కు గురైన ఆయన పక్షవాతం రావడంతో మంచం పట్టారు. ఈక్రమంలో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన దాదాపు 200 చిత్రాలకుపైగా సంగీతం అందించారు. అంతేకాకుండా దాదాపు పన్నెండు హిందీ మువీలకు సంగీత దర్శకత్వం వహించారు. బుధవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జాయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా జాయ్ 1975లో ‘ప్రేమలేఖ’తో సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేశారు. మలయాళ సినీ చరిత్రలో తొలి ‘టెక్నో మ్యూజిషియన్’ కూడా ఆయనే. ఆయన అద్భుత కంపోజిషన్లు, మెలోడీలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. వివిధ సంగీత దర్శకుల వద్ద 500కు పైగా సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. 1975లో విడుదలైన “ప్రేమలేఖ` చిత్రానికి ఆయన తొలి సంగీత దర్శకత్వం వహించారు. ‘ఎన్ స్వరం పూవిట్టుం గానమే’ అనే పాటకు ఆయన సంగీతం అందించారు. ఇది ఇప్పటికీ మలయాళంలో సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. సందర్భానుసారంగా మలయాళీలకు సరికొత్త బాణీలను అందించాడు. ఆయన స్వరపరిచిన ‘బార్న్ ఇన్ ఎ మ్యాంగర్’ అనే క్రైస్తవ పాట చాలా పాపులర్ అయ్యింది. జాయ్ చర్చి గాయక బృందంలో వయోలిన్ వాయించడం ద్వారా సంగీతంలోకి అడుగుపెట్టారు. 18 సంవత్సరాల వయస్సులో KJ జాయ్ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎమ్‌ఎస్ విశ్వనాథన్ ఆర్కెస్ట్రాలో చేరి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
అలా ఆయన.. ప్రేమలేఖ, ముక్కవన్ ప్రేమించిన దెయ్యం, అనుపల్లవి, సర్పం, తరంగం, చందనచోళ, ఆరాధన, ఇవన్నె ప్రియపుత్ర, శక్తి, చంద్రహాసం, మకరవిళక్, మన్మృగం, అహల్య, లీసా, ముచ్చట్లు, ఇతిహాసం, కరీంబుచ్చాఝామ్ వంటి ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. పెయ్యను మద్దాలం కొట్టును మొదలగునవి సంతోషము.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.