Dhamaka Movie: బుల్లి తెరపై సందడి చేయనున్న ధమాకా మూవీ.. ఏ ఛానల్‌లో రానుందంటే.
రవితేజ హీరోగా వచ్చిన చిత్రం ధమాకా భారీ విజయాన్ని అందుకన్న విషయం తెలిసిందే. త్రినాథరాఉ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిఇనమా రవితేజాకు సాలిడ్ హిట్‌ను అందించింది. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న..

రవితేజ హీరోగా వచ్చిన చిత్రం ధమాకా భారీ విజయాన్ని అందుకన్న విషయం తెలిసిందే. త్రినాథరాఉ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిఇనమా రవితేజాకు సాలిడ్ హిట్‌ను అందించింది. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల రేంజ్‌ను ఈ సినిమా పెంచేసింది. థియేటర్‌లో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ధమాకా అత్యధిక వ్యూయింగ్ మినిట్స్‌తో సత్తా చాటింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా బుల్లి తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. స్టార్ మా ఛానల్‌లో తొలిసారి టీవీలో ధమాకా ప్రసారం కానుంది. మార్చి 26 తేదీ సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రసారం కానుంది. దీంతో థియేటర్, ఓటీటీలో సినిమాను మిస్ అయిన వారి ధమాకా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
ధమాకా మూవీ కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమా నైజాంలో రూ. 18.01 కోట్లు, సీడెడ్ రూ. 7.32 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 4.64 కోట్లు, ఈస్ట్ రూ. 1.91 కోట్లు, వెస్ట్ రూ. 1.30 కోట్లు, గుంటూరు రూ. 1.90 కోట్లు, కృష్ణా రూ. 1.79 కోట్లు, నెల్లూరు రూ. 1.00 కోట్లు, ఏపీ, తెలంగాణ మొత్తంగా రూ. 37.87 కోట్లు రాబట్టింది.



