సూర్య మూవీకి తెలుగు టైటిల్ ఫిక్స్.. ఫస్ట్‌లుక్ విడుదల

కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం ‘కప్పమ్’. ఈ మూవీకి తెలుగులో బందోబస్తు అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాజమౌళి.. ‘‘సూర్య, మోహన్ లాల్ సర్‌ల బందోబస్తు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. కేవీ ఆనంద్, బందోబస్తు మొత్తం టీమ్‌కు బెస్ట్ విషెస్‌’’ అని కామెంట్ పెట్టాడు. Happy to release the First Look of @Suriya_offl […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:39 am, Fri, 28 June 19
సూర్య మూవీకి తెలుగు టైటిల్ ఫిక్స్.. ఫస్ట్‌లుక్ విడుదల

కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం ‘కప్పమ్’. ఈ మూవీకి తెలుగులో బందోబస్తు అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాజమౌళి.. ‘‘సూర్య, మోహన్ లాల్ సర్‌ల బందోబస్తు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. కేవీ ఆనంద్, బందోబస్తు మొత్తం టీమ్‌కు బెస్ట్ విషెస్‌’’ అని కామెంట్ పెట్టాడు.

కాగా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య సరసన సాయేషా సైగల్ నటించగా.. మోహన్ లాల్, ఆర్య, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి హారీష్ జైరాజ్ సంగీతం అందించాడు. అయితే 24 తరువాత ఆ రేంజ్‌ హిట్‌కు దూరమయ్యాడు సూర్య. దీంతో కప్పమ్(బందోబస్తు)పై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు.