AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్‌బాస్ 3’ ప్రారంభం అప్పుడేనా..?

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాలిటీ షోలలో ‘బిగ్‌బాస్’ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలో మూడో సీజన్‌తో సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారంతో నడిపే శక్తి గల వ్యక్తి ఎవరిదీ అన్న డైలాగ్‌లో టీజర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు ఈ షో కోసంహోస్ట్‌గా నాగార్జున కన్ఫర్మ్ అవ్వగా.. కంటెస్టంట్‌ల లిస్ట్‌ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ ప్రారంభానికి సంబంధించిన ఓ వార్త […]

‘బిగ్‌బాస్ 3’ ప్రారంభం అప్పుడేనా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 10:06 AM

Share

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాలిటీ షోలలో ‘బిగ్‌బాస్’ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలో మూడో సీజన్‌తో సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారంతో నడిపే శక్తి గల వ్యక్తి ఎవరిదీ అన్న డైలాగ్‌లో టీజర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు ఈ షో కోసంహోస్ట్‌గా నాగార్జున కన్ఫర్మ్ అవ్వగా.. కంటెస్టంట్‌ల లిస్ట్‌ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ ప్రారంభానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే జూలై 21న బిగ్‌బాస్ సీజన్‌ 3 ప్రారంభం కానునట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు వచ్చిన రెండు సీజన్లకు ధీటుగా మూడో బిగ్‌బాస్‌ ఉండబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్‌ హోస్ట్‌గా తమిళంలో బిగ్‌బాస్ 3 ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే.