AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాల్ కి ఏమీ తెలియదు.. అన్నింట్లోనూ.. : రాధారవి

చెన్నై: తమిళ సీనియర్ నటుడు రాధారవి ఇటీవల కోలీవుడ్ మీడియాలో కేంద్ర బిందువుగా మారారు. తాజాగా ఆయన స్టార్ హీరో విశాల్ గురించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘విశాల్ కి ఏమీ తెలియదు .. కానీ అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు. ‘రాధ’ అనేది మా తండ్రిగారి పేరు .. అందుకే అది నా పేరుకు ముందు వచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాధారవి కొద్ది రోజుల క్రిందట ఒక సినిమా ఫంక్షన్‌లో  హీరోయిన్ నయనతారపై […]

విశాల్ కి ఏమీ తెలియదు.. అన్నింట్లోనూ.. : రాధారవి
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 6:30 PM

Share
చెన్నై: తమిళ సీనియర్ నటుడు రాధారవి ఇటీవల కోలీవుడ్ మీడియాలో కేంద్ర బిందువుగా మారారు. తాజాగా ఆయన స్టార్ హీరో విశాల్ గురించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘విశాల్ కి ఏమీ తెలియదు .. కానీ అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు. ‘రాధ’ అనేది మా తండ్రిగారి పేరు .. అందుకే అది నా పేరుకు ముందు వచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు.
రాధారవి కొద్ది రోజుల క్రిందట ఒక సినిమా ఫంక్షన్‌లో  హీరోయిన్ నయనతారపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘రాధారవి గారూ.. మహిళల గురించి, ముఖ్యంగా ఒక నటి గురించి మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఒక మహిళ వల్లనే మీరు పెరిగి పెద్దవారయ్యారనే కనీస జ్ఞానం కూడా మీకు లేదు. మహిళలంటే గౌరవం లేని మీరు.. మీ పేరులోని ‘రాధ’ను తొలగించి.. ‘రవి’ అని మాత్రమే పిలుపించుకోండి’’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us