నక్సలైట్‌గా రానా..!

నక్సలైట్‌గా రానా..!

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య పాత్రలలో నటిస్తూ వస్తోన్న దగ్గుబాటి రానా ఇప్పుడు నక్సలైట్‌గా మారనున్నాడు. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించనున్నాడట. నక్సలైట్‌గా మారి అవినీతిపై పోరాటం చేసే పాత్రలో ఆయన కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘విరాటపర్వం’ అనే […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Apr 06, 2019 | 10:25 AM

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య పాత్రలలో నటిస్తూ వస్తోన్న దగ్గుబాటి రానా ఇప్పుడు నక్సలైట్‌గా మారనున్నాడు. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించనున్నాడట. నక్సలైట్‌గా మారి అవినీతిపై పోరాటం చేసే పాత్రలో ఆయన కనిపించనున్నాడట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘విరాటపర్వం’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటించనుంది. సీనియర్ నటి టబు మానవ హక్కుల కార్యకర్తగా కనిపించనుందట. కాగా ఈ సినిమాలో రానా పాత్రపై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి. రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడని, పంచాయితీ వార్డు మెంబర్‌గా కనిపించనున్నాడని ఇలా పలు రకాలు వార్తలు వచ్చాయి.  మరి ఈ సినిమాకు సంబంధించి ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu