పవర్‌ఫుల్ టైటిల్ తో రానున్న నాని
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను నటించిన లేటెస్ట్ చిత్రం ‘జెర్సీ’ రిలీజ్ కు రెడీగా ఉండగా.. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నాడు. ఇక వీటితో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో కూడా నాని ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అష్టా చెమ్మా’, ‘జెంటిల్ మెన్’ […]
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను నటించిన లేటెస్ట్ చిత్రం ‘జెర్సీ’ రిలీజ్ కు రెడీగా ఉండగా.. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నాడు. ఇక వీటితో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో కూడా నాని ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అష్టా చెమ్మా’, ‘జెంటిల్ మెన్’ సినిమాలు రెండూ సూపర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. కాగా మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారట చిత్ర యూనిట్. దిల్ రాజు, నాని కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.