వైరల్: ప్రియాంక, నిక్ ల విడాకులు..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. గత ఏడాది డిసెంబర్ లో నిక్ జోన్స్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి జరిగి ఇంకా నాలుగు నెలలు గడవక ముందే వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక అంతర్జాతీయ ప్రచురణ సంస్థ కథనం ప్రకారం ప్రియాంక, నిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రియాంక ఇతరులను అదుపు చేయాలని అనుకుంటుంది. అంతేకాకుండా త్వరగా కోపం కూడా తెచ్చుకుంటుంది. ఇక ఇదే వారిద్దరూ విడాకులు […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. గత ఏడాది డిసెంబర్ లో నిక్ జోన్స్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి జరిగి ఇంకా నాలుగు నెలలు గడవక ముందే వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక అంతర్జాతీయ ప్రచురణ సంస్థ కథనం ప్రకారం ప్రియాంక, నిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం.
సాధారణంగా ప్రియాంక ఇతరులను అదుపు చేయాలని అనుకుంటుంది. అంతేకాకుండా త్వరగా కోపం కూడా తెచ్చుకుంటుంది. ఇక ఇదే వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం అని చెబుతున్నారు. రోజూ ఇద్దరి మధ్య ప్రతీ విషయంలో గొడవలు జరుగుతున్నాయట. ఇది భరించలేక విడాకులు తీసుకోవాలని చూస్తున్నారని’ ఆ కథనంలో పేర్కొన్నారు.
మరోవైపు ప్రియాంక పెళ్లి తర్వాత తన స్వభావం మార్చుకుంటుందని నిక్ కుటుంబ సభ్యులు భావించారట. అయితే ప్రియాంక స్వభావం ఏమాత్రం మారకపోవడం, నిక్ చేసే ప్రతీ విషయానికి ఆంక్షలు పెట్టడం వంటివి వారికి నచ్చటలేదని వినికిడి. ఇక పీసీ త్వరగా కోపం తెచ్చుకుంటుందన్న విషయం అసలు నిక్ కి తెలియదట. ఇవన్నీ చూసి నిక్ కుటుంబం ఈ పెళ్లిని రద్దు చేసుకోమని నిక్ కి సూచించినట్లు ఆ కథనం ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ప్రియాంక ప్రతినిధి కొట్టి పారేశారు.
ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక, నిక్ లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నారు. నిక్ ‘జుమాంజీ’కి సిద్ధమవుతుంటే… మరోవైపు ప్రియాంక ‘ద స్కై ఈజ్ పింక్’ చిత్రంతో బాలీవుడ్ లోకి రీ- ఎంట్రీ ఇవ్వనుంది.