Post Office: ప్రతీ రోజూ రూ. 400 ఆదా చేస్తే.! పదేళ్లలో రూ. 20 లక్షలు.. పోస్టాఫీస్‌లో అద్దిరిపోయే స్కీం
రోజుకు రూ. 400 ఆదా చేస్తే.. పదేళ్లలో రూ. 20 లక్షలు మీ సొంతం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీంలో మీరు పెట్టుబడి పెడితే.. 6.70 శాతం వడ్డీ రేటుతో మీకు అధిక రాబడి లభిస్తుంది. రూ. 100తో ఇందులో ఖాతా తెరవచ్చు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

మీరు లాంగ్ టైం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్లాన్‌లో ఉన్నారా.? మీ డబ్బుకు సేఫ్టీ, అలాగే రిటర్న్స్ కూడా కావాలనుకుంటే.. కచ్చితంగా ఈ పోస్టాఫీస్ స్కీంపై ఓ లుక్కేయండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా.. తక్కువ పెట్టుబడితో అధిక రాబడులు అందించేలా పోస్టాఫీస్ పలు స్కీంలను అందుబాటులోకి తెచ్చింది. అలాంటి పథకాల్లో ఒకటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) స్కీం. ఈ ఆర్డీ స్కీం కింద, మీరు రోజుకు కేవలం రూ. 400 ఆదా చేయడం ద్వారా పదేళ్లలో రూ. 20 లక్షల రాబడిని పొందొచ్చు. పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. ప్రస్తుతం, ఐదు సంవత్సరాల పెట్టుబడికి 6.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ఆర్డీలో మీరు కేవలం రూ. 100తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాల వయసు ఉన్న మైనర్లు కూడా వారి తల్లిదండ్రుల సహాయంతో ఖాతాను తెరవచ్చు. ఇక వారు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, తమ కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ స్కీంకి ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. అయితే, దాన్ని మరో ఐదు సంవత్సరాలు కూడా పొడిగించుకునే ఛాన్స్ ఉంది.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
ఈ స్కీంలో మీరు పెట్టుబడి పెడితే.. దాని నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. మీరు ఖాతాను ఒక సంవత్సరం పాటు యాక్టివ్‌గా ఉంచితే.. మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్‌కు 2 పర్సెంట్ వడ్డీ వస్తుంది. మీరు మీ స్థానిక పోస్టాఫీస్‌లో ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో క్రమం తప్పకుండా కేవలం రూ. 400 పెట్టుబడి పెడుతూ ఉంటే.. మీరు రూ. 20 లక్షల రాబడిని పొందొచ్చు. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు ప్రతి రోజు రూ. 400 ఆదా చేస్తే, అది నెలకు రూ. 12,000 అవుతుంది. ఈ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీంలో పెట్టుబడి పెడితే, ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి సుమారు రూ. 7.20 లక్షలకు చేరుతుంది. ఇక తన అకౌంట్ మెచ్యూరిటీని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే, అంటే మొత్తం పదేళ్ల కాలానికి, అది రూ. 14.40 లక్షలకు చేరుతుంది. అలాగే మొత్తంగా రూ. 20.50 లక్షల కార్పస్ నిధిని సమకూర్చుతుంది. ఇందులో రూ. 6.10 లక్షలు వడ్డీ రూపంలో వచ్చినట్టు. ఇలా సరైన స్కీంలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీరు భవిష్యత్తు కోసం చక్కటి రాబడిని పొందొచ్చు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




