సంక్రాంతి పండగ వేళ పెను ప్రమాదం.. రోడ్డున పడ్డ 46 కుటుంబాలు.. సరుకులు కొందామని వెళితే..
అడవిని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే గిరిజనులు వారు. నేటికీ పూరిళ్లలోనే 46 కుటుంబాలకు చెందిన 120 మంది జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం వారిని నిరాశ్రయులను చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కొండల్లోని ప్రశాంత మైన గిరిజన పల్లె సార్లంక(తండా)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి బూడిద తప్ప ఏమీ మిగల్లేదు.

అడవిని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే గిరిజనులు వారు. నేటికీ పూరిళ్లలోనే 46 కుటుంబాలకు చెందిన 120 మంది జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం వారిని నిరాశ్రయులను చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కొండల్లోని ప్రశాంత మైన గిరిజన పల్లె సార్లంక(తండా)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి బూడిద తప్ప ఏమీ మిగల్లేదు. మండల కేంద్రం రౌతులపూడికి 20 కి.మీ. దూరంలో రాఘవపట్నం పంచాయతీలో సార్లంక ఉంది. కాకినాడ-అనకాపల్లి జిల్లాల సరిహద్దులో ఉంది.. ఈ ప్రమాదంతో రెండు జిల్లాల గిరిజనులు గూడు లేనివారయ్యారు.
సంక్రాంతికి సరకులు కొనుక్కునేందుకు మహిళలు, పిల్లల్ని వదిలేసి గ్రామస్థులంతా రౌతులపూడి సంత, తుని పట్టణంలోని మార్కెట్లకు వెళ్లారు. కొందరు చేలల్లో పనులు చేసుకుంటున్నారు. సాయంత్రం ఆకస్మాత్తుగా నిప్పురేగి తండా అంతా మంటల్లో చిక్కుకుంది. ఇళ్లలో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక ఇంటిలో మొదలైన మంటలు.. చెంబుల రాంబాబు, రమ ణబాబు, నూకాలమ్మ, ఇలా అందరి పూరిళ్లకు వ్యాపించాయి.
విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు లీకై మంటలు పెద్దవయ్యాయని తెలిపారు.. తుని నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసరికే ఊరు బూడిదైంది. ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తినష్టం రూ.అరకోటికి పైనే ఉంటుందని ప్రాథమిక అంచనా.. బాధితులకు అన్న విధాల ఆదుకుంటామన్నారు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ… కాలి బూడిదైన ఇళ్ల స్థలాల ప్రాంతాన్ని పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కూటమినేతలు.. బాధితులకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. పండుగకు ముందు ఇళ్లు కాలి బూడిదవ్వడంతో.. గిరిజనులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
