Viral Video: పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది.. అంబటి రాంబాబు డ్యాన్స్ చూశారా.!
సంక్రాంతి అంటే నేనే అంటున్నారు అంబటి రాంబాబు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. చాలా రోజుల నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అంబటి రాంబాబు డ్యాన్సులు ఇంకా ఫేమస్ అయ్యాయి. అప్పటి నుంచి తన స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్నారు అంటి. ఈ మూడు బాక్సుల్లో చూడొచ్చు అంబటి స్టెప్పులు.

సంక్రాంతి అంటే.. గుంటూరులో మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడుంది అంబటి రాంబాబు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భోగి పండుగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే కాముడి దహనం చేశారు. ఈ వేడుకలకు పట్టణంలోని పలుప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. ముఖ్యంగా రాంబాబు డ్యాన్స్ కోసం అంతా ఎదురుచూశారు. అక్కడకు వచ్చిన మాజీ ఎంపీ మోదుగులతో కలిసి అంబటి కాసేపు స్టెప్పులేశారు. అయితే తన డ్యాన్సు అప్పుడే కాదు.. ఇకముందు చూపిస్తా అని అప్పుడే చెప్పారు అంబటి. అన్నట్లుగానే ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి వచ్చి.. ఓ మంచి కొరియోగ్రాఫ్ చేసి చూపించారు. లయబద్దంగా స్టెప్పులు వేస్తూ అంబటి సంబరాలు చేసుకున్నారు.
సంక్రాంతి అంటే నేనే అంటున్నారు అంబటి రాంబాబు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. చాలా రోజుల నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అంబటి రాంబాబు డ్యాన్సులు ఇంకా ఫేమస్ అయ్యాయి. అప్పటి నుంచి తన స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్నారు అంటి. ఈ మూడు బాక్సుల్లో చూడొచ్చు అంబటి స్టెప్పులు. అప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండేవారు.. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. భోగి మంటల్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను దహనం చేశామన్నారు మాజీ మంత్రి అంబటి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి ఇచ్చిన జీవోలను కాల్చేశామన్నారు. అయితే తనకు సంబరాల రాంబాబు అనే పేరు రావడానికి కారణం పవన్ కల్యాణే అన్నారు.
