ట్రంప్ ఫొటోలతో భోగి మంటలు.. తిరుపతిలో సిపిఐ వినూత్న సంబరాలు..
టెంపుల్ సిటీ తిరుపతిలో సిపిఐ వినూత్నంగా భోగిమంటలు వేసింది. అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫొటోలు ముద్రించిన పేపర్లను మంటల్లో వేసింది. ప్రపంచ దేశాలు ట్రంప్‌ను బహిష్కరించాలంటూ బైరాగి పట్టెడలో సిపిఐ భోగిమంటలు వేసింది. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే. నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

టెంపుల్ సిటీ తిరుపతిలో సిపిఐ వినూత్నంగా భోగిమంటలు వేసింది. అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫొటోలు ముద్రించిన పేపర్లను మంటల్లో వేసింది. ప్రపంచ దేశాలు ట్రంప్‌ను బహిష్కరించాలంటూ బైరాగి పట్టెడలో సిపిఐ భోగిమంటలు వేసింది. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే. నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను భోగిమంటల్లో వేసి దగ్ధం చేసిన సిపిఐ జాతీయ నేత నారాయణ ట్రంప్ తీరు పై మండి పడ్డారు. అమెరికా.. వెనుజులా అధ్యక్షుడి నిర్బంధంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తులు కలిగిన వెనిజులా పై అమెరికా అధ్యక్షుడు కన్ను పడిందన్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా ట్రంప్ చర్యలను వ్యతిరేకించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్పందించాలని నారాయణ కోరారు.

Cpi Narayana
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ది రాక్షస పాలన అంటూ నారాయణ మండిపడ్డారు. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల్లో ట్రంప్ పాలనపై తిరుగుబాటు మొదలైందన్నారు. వెనిజులా అధ్యక్షుడు ఆయన భార్యను అర్ధరాత్రి పూట అమెరికా బలగాలు కిడ్నాప్ చేశాయని ఈ ఘటన అత్యంత అమానుషమైన చర్య అన్నారు నారాయణ.. ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు నిక్షేపాలు ఉన్న వెనిజులాపై కన్నేసిన అమెరికా చమురు కోసం అమెరికా కార్పొరేట్ కంపెనీలు కుట్రకు పాల్పడుతున్నాయన్నారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లోనే ట్రంప్‌కు వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయన్నారు.
వీడియో చూడండి..
సొంత గడ్డపైనే ట్రంప్‌కు మద్దతు లేదని.. అమెరికా అరాచకాలను భారత్ ఖండించకపోవడం విచారకరమని నారాయణ పేర్కొన్నారు. అమెరికా అంతర్జాతీయ అరాచకాలపై అందరూ గళం విప్పాలని సీపీఐ నేషనల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
