తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ యాదవ్ కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సంక్రాంతి వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు గాలిపటాలు అందించారు. ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.