జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. జియో త్వరలోనే ఒక 'పీపుల్-ఫస్ట్' ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్‌లో, భారత్ కోసం, ప్రపంచం కోసం దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ కొత్త ప్లాట్‌ఫాం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు, గుజరాత్ నుంచి మొదలుపెట్టి, తమ సొంత భాషలో, తమ సొంత డివైజ్‌పై ఏఐ సేవలను సులభంగా వినియోగించుకోవచ్చని అంబానీ వివరించారు. దీనివల్ల ప్రజల సామర్థ్యం, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌ను భారతదేశంలో ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. దీని కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, జామ్‌నగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఏఐ-రెడీ డేటా సెంటర్ నిర్మిస్తున్నాం. దీని ఏకైక లక్ష్యం – ప్రతి భారతీయుడికి సరసమైన ఏఐ అందుబాటులో ఉంచడమేనని అంబానీ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

