ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 13 నుండి మద్యం ధరలను పెంచింది. రూ.99 కంటే ఎక్కువ ధర ఉన్న అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 పెంపును ప్రకటించింది. అయితే రూ.99 లోపు ధర ఉన్న వాటిపై ఎలాంటి పెంపు లేదు. రిటైలర్లకు మార్జిన్ ఒక శాతం పెరిగింది. ఈ నిర్ణయం మద్యం ప్రియులకు షాక్‌ను కలిగించింది.