‘సీత’ టీజర్ విడుదల..!

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాజల్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తుండగా.. సాయి శ్రీనివాస్ సీతను ప్రేమించే బావ పాత్రలో కనిపించనున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో […]

'సీత' టీజర్ విడుదల..!
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 6:01 PM

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాజల్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తుండగా.. సాయి శ్రీనివాస్ సీతను ప్రేమించే బావ పాత్రలో కనిపించనున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.