AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఓటీటీలోకి మలయాళం డార్క్ కామెడీ సూపర్ హిట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళం, మలయాళం భాషలలో విడుదలై సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఓ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema : ఓటీటీలోకి మలయాళం డార్క్ కామెడీ సూపర్ హిట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Bharatanatyam 2 Mohiniyatta
Rajitha Chanti
|

Updated on: May 03, 2026 | 1:29 PM

Share

సాధారణంగా ఓటీటీలో విభిన్న కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. భాషతో సంబంధం లేకపోయినా కొత్త కొత్త సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన వాలా 2 చిత్రం తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న మలయాళ డార్క్ కామెడీ చిత్రం ‘భరతనాట్యం-2 మోహినియాట్టం ’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

యువ నటుడు సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ కామెడీగా తెరకెక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది. మే 8 నుంచి ఈ చిత్రం ఓటీటీ అడియన్స్ ముందుకు రానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఓటీటీలో మెప్పించనుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఊహించని సమస్యలు, వాటి నుండి బయటపడటానికి వారు చేసే ప్రయత్నాలను దర్శకుడు కృష్ణదాస్ మురళి ఎంతో హాస్యభరితంగా ఈ చిత్రంలో చూపించారు.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.21.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన రహస్యాల చుట్టూ తిరుగుతుంది. కుటుంబం ప్రతిష్టను కాపాడటానికి కథానాయకుడు పడే పాట్లు, ఆ క్రమంలో చోటుచేసుకునే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. సాయిజు కురుప్ తన సహజసిద్ధమైన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Follow Us
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి