AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఒకప్పుడు ఆమె సాధారణ అమ్మాయి. కేవలం రూ.5వేలకు ఒక స్కూల్లో ఊపాధ్యాయురాలిగా పని చేసింది. కానీ ఆమె ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్. అందం, అభినయంతోపాటు గ్లామరస్ బ్యూటీగా కట్టిపడేసింది. ఆమె సినిమాలకు, నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
Anushka Shetty
Rajitha Chanti
|

Updated on: May 02, 2026 | 7:11 PM

Share

భారతీయ సినిమా రంగంలో నటీమణులకు హీరోలతోపాటు క్రేజ్ రావడం అంత సులభమేమి కాదు. కానీ కొందరు మాత్రమే అంతటి స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అటు గ్లామరస్ రోల్స్.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె నటనతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకుంది. కేవలం తన ప్రతిభ, వ్యక్తిత్వం, పట్టుదలతో పరిశ్రమలో తనదైన బలమైన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. నిజానికి ఆమె ఇప్పుడు తెలుగులో లేడీ సూపర్ స్టార్ అనే చెప్పాలి. కానీ మీకు తెలుసా.. ? ఒకప్పుడు ఆమె పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఆ తర్వాత అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి కథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.

ఇంతకీ పైన ఫోటోలో కనిపించిన అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అనుష్క శెట్టి. దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి విజయవంతంగా అడుగుపెట్టారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు. ప్రభాస్, రవితేజ, సూర్య, గోపిచంద్, విజయ్, కార్తీక్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈమూవీ ఆమె కెరీర్ మార్చేసింది. ఆతర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. 2015లో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆమె పేరు మారుమోగింది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

గ్లామరస్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉంటే ఎలాంటి రోల్స్ అయిన చేయడానికి రెడీగా ఉండేది. వేదం చిత్రంలో వేశ్య పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరించింది అనుష్క. ఆ తర్వాత సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగి లావుగా మారిపోయింది. కానీ బాహుబలి సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. చివరగా ఘాటి చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి పేరు ఎత్తకుండా ఒంటరిగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..

Anushka

Anushka

ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Follow Us
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే
టీ20 జట్టుకు ఎంపిక కాలేదని.. సూసైడ్ చేసుకున్న యువ మహిళా క్రికెటర్
టీ20 జట్టుకు ఎంపిక కాలేదని.. సూసైడ్ చేసుకున్న యువ మహిళా క్రికెటర్
పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే
పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే