AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరో గోపిచంద్. మొదట్లో విలన్ పాత్రలతో అదరగొట్టిన ఆయన.. ప్రస్తుతం హీరోగా తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయం సినిమాకు తన పారితోషికం గురించి వెల్లడించారు. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చ చేశాను అనే విషయాన్ని వెల్లడించారు.

Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..
Gopichand
Rajitha Chanti
|

Updated on: May 02, 2026 | 6:05 PM

Share

నటుడు గోపీచంద్ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తొలి వలపు సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. ఆతర్వాత విలన్ పాత్రలలోనూ కనిపించారు. సూపర్ హిట్ జయం సినిమాతోపాటు నిజం చిత్రంలోనూ విలన్ పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వత యజ్ఞం మూవీతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇప్పటికీ హీరోగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్ళ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా, ఆయన సినీ ప్రస్థానంలో తన తొలి చిత్రమైన జయం కోసం అందుకున్న పారితోషికం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జయం సినిమాకు గాను తనకు 11,000 రూపాయలు రెమ్యూనరేషన్ లభించిందని గోపీచంద్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.

ఈ మొత్తం గురించి ప్రస్తావించినప్పుడు, మొదట తనకు 11,000 రూపాయలు ఎందుకో అర్థం కాలేదని, ఏం చేయాలో తెలియలేదని అన్నారు. అయితే, అది దర్శకుడు తేజ అదృష్ట సంఖ్య కావడంతో ఆ పారితోషికం లభించిందని తర్వాత తెలిసిందని గోపీచంద్ వివరించారు. అప్పుడు ఆ పక్కన ఇంకో సున్నా ఉండొచ్చు కదా అనిపించిందని సరదాగా గుర్తు చేసుకున్నారు. తన మొదటి సంపాదన కాబట్టి, ఆ డబ్బును తీసుకువెళ్లి ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నానని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

డైరెక్టర్ తేజ దర్శకత్వంలో 2002లో విడుదలైన ‘జయం’ సినిమా టాలీవుడ్‌లో ఒక సంచలనం. ఈ సినిమాతోనే నితిన్ హీరోగా పరిచయం కాగా, గోపిచంద్ విలన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో గోపిచంద్ పోషించిన ‘రఘు’ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతకుముందు ‘తొలివలపు’ సినిమాతో హీరోగా పరిచయమైనా అది ఆశించిన విజయం సాధించలేదు. దీంతో దర్శకుడు తేజ అడిగిన వెంటనే, రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించకుండా గోపిచంద్ ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేశారు. డబ్బు కంటే కూడా ఆ పాత్ర తెచ్చిన గుర్తింపే ఆయనకు పెద్ద ఆస్తిగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Follow Us