42 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు

Rajitha Chanti

Pic credit - Instagram

03 May 2026

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి త్రిష కృష్ణన్. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఆమె కెరీర్ మరోసారి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. 42 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది ఈ అమ్మడు. 

తాజాగా తన ఫిట్నె్స్ సీక్రెట్స్ రివీల్ చేసింది. త్రిష తన ఫిట్‌నెస్ కోసం కేవలం డైటింగ్‌పైనే కాకుండా, కఠినమైన వ్యాయామాలపై కూడా దృష్టి పెడుతుందని తెలిపింది.

జిమ్‌లో కార్డియో వ్యాయామాలతో పాటు 'స్ట్రెంత్ ట్రైనింగ్'కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది కండరాల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా, శరీర మెటబాలిజంను క్రమబద్ధీకరిస్తుంది

వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇది వయసు పెరుగుతున్నా శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

త్రిషకు నడక (Walking) అంటే చాలా ఇష్టం. ఆమె రోజుకు కనీసం 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మానసిక ప్రశాంతత కోసం త్రిష యోగాను ఆశ్రయిస్తుంది. ఇది ఆమె చర్మం నిగారింపును పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.