AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copper Vs Glass Bottle: రాగి బాటిల్‌.. గాజు బాటిల్‌.. ఎందులోని నీళ్లు తాగడానికి సురక్షితం?

ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు సరిపడా తాగాలి. అయితే రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఓ బాటిల్‌ వెంట తీసుకువెళ్లడం మనందరికీ అలవాటే. కొందరు రాగి బాటిల్‌, మరికొందరు రాగి బాటిల్‌ ఇష్టపడతారు. రాగి సీసాలోని నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే గాజు సీసా రసాయనాలు లేనిది. సురక్షితమైనది. మీ ఆరోగ్యానికి ఏ సీసా ఉత్తమమో తెలుసుకోవాలంటే..

Copper Vs Glass Bottle: రాగి బాటిల్‌.. గాజు బాటిల్‌.. ఎందులోని నీళ్లు తాగడానికి సురక్షితం?
Copper Bottle Vs Glass Bottle
Srilakshmi C
|

Updated on: Jan 14, 2026 | 11:58 AM

Share

మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో దానిని నిల్వ చేసే పాత్ర కూడా అంతే ముఖ్యం. చాలా మంది సీజన్‌కు అనుగుణంగా తమ వాటర్‌ బాటిళ్లను మారుస్తారు. ప్రధానంగా రాగి, గాజు సీసాలను ఉపయోగిస్తారు. ఈ రెండు సీసాలు వాటి స్వంత ప్రత్యేక ప్రయోజనాలు, లక్షణాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా రాగికి సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. నీటిని రాగి సీసాలో కనీసం 16 గంటలు నిల్వ ఉంచితే, అందులోని హానికరమైన బ్యాక్టీరియా నశించి, నీరు సహజంగా శుద్ధి అవుతుంది.

రాగి సీసాలో నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. రాగి నీటి రుచిని కొద్దిగా మారుస్తుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక గాజు సీసాలోని నీరు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గాజు సీసా అతి ముఖ్య లక్షణం ఏమిటంటే అది నీటిలోకి ఎటువంటి రసాయన మూలకాలను విడుదల చేయదు. ప్లాస్టిక్‌తో పోలిస్తే గాజు సీసా చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. గాజు సీసా నీటి అసలు రుచిని మార్చదు. ఇందులో ఎటువంటి హానికరమైన రసాయనాలు ఉండవు.

గాజు సీసాలను ఉపయోగించేటప్పుడు వాటి మూతలపై శ్రద్ధ చూపడం ముఖ్యం. కొన్నిసార్లు నాణ్యత లేని మూతలు నీటిలోకి రంగు కణాలను లీక్‌ చేస్తాయి. అందువల్ల, ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల మూత ఉన్న బాటిల్‌లను మాత్రమే ఎంచుకోవాలి. మీరు తాగే నీటిని సహజంగా శుద్ధి చేయడానికి, అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే రాగి సీసా మంచి ఎంపిక. అయితే, మీరు మీ నీటి రుచిని మార్చకూడదనుకుంటే, రసాయన రహిత నీళ్లు కావాలంటే గాజు సీసా సురక్షితమైన ఎంపిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.