హిమాలయాల్లో ‘సిక్కిం సుందరి’..ముప్పై ఏళ్లకు ఒక్కసారి..వీడియో
దశాబ్దాల ఎదురు చూపు ఫలించింది. ప్రకృతి ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆ సిక్కిం సుందరి హిమాలయాల్లో కనువిందు చేస్తోంది. చాలా అరుదుగా తూర్పు హిమాలయాల్లో మాత్రమే వికసించే ఈ పుష్పం దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులు వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ సిక్కిం సుందరి పువ్వును శాస్త్రీయంగా 'రుమ్ నోబిలే' అని పిలుస్తారు. ఈ సిక్కిం సుందరిని 'గ్లాస్ హౌస్ ప్లాంట్' అని కూడా పిలుస్తారు.
హిమాలయాల్లోని గడ్డకట్టే చలి, గాలులు, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి లోపల ఉండే పువ్వులను కాపాడుతూ ఉంటాయి. పువ్వు చుట్టూ ఉండే పొరలు సూర్యరశ్మిని లోపలికి పంపించి.. ఒక గ్రీన్‌హౌస్‌లా పనిచేస్తూ లోపల వేడిని నిలిపి ఉంచుతాయి. దీనివల్ల అతిశీతల వాతావరణంలోనూ ఈ సిక్కిం సుందరి మొక్క మనుగడ సాగిస్తుంది. ‘మోనోకార్పిక్’ రకానికి చెందిన ఈ మొక్క సుమారు 7 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు కేవలం ఆకులతో నేలకు హత్తుకుని పెరుగుతూ శక్తిని కూడగట్టుకుంటుంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఒక్కసారి మాత్రమే ఇది సుమారు 2 మీటర్ల ఎత్తు వరకు పెరిగి.. అద్భుతమైన గోపురం ఆకారంలో పూలను పూయిస్తుంది. ఇది సిక్కిం, నేపాల్, భూటాన్, టిబెట్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ మొక్కను సిక్కిం సుందరి అని పిలుస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
హిమాలయాల్లో 'సిక్కిం సుందరి'..ముప్పై ఏళ్లకు ఒక్కసారి..వీడియో
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
