AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వయసులోనూ అందుకే ఇంత అందంగా, ఫిట్‌గా ఉన్నా.. సీక్రెట్ చెప్పిన నటి యమున

తన అందం, అభినయంతో వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకుల మనసులు చూరగొంది ప్రముఖ నటి యమున. కర్ణాటకలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఆమె మౌన పోరాటం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్రమందారం, బంగారు కుటుంబం, బ్రహ్మచారి మొగుడు తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ వయసులోనూ అందుకే ఇంత అందంగా, ఫిట్‌గా ఉన్నా.. సీక్రెట్ చెప్పిన నటి యమున
Yamuna
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2026 | 11:44 AM

Share

ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు నటి యమున. తన అందం , అభినయంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు యమున. మౌన పోరాటం మూవీ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అందం, అభినయంతో తన మార్క్ చూపించింది. ఫ్యామిలీ హీరోయిన్‌ అనే ట్యాగ్ సంపాదించుకుంది. ఆతర్వాత ఊహించని సంఘటన వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తిరిగి కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు యమున. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న యమున.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన అందానికి రహస్యం కూడా చెప్పారు యమున.

నటి యమున తన 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అందంగా చాలా ఫిట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటి నుండి తనలో ఎటువంటి మార్పూ లేదని, దీనికి కారణం తన ఆరోగ్యకరమైన జీవనశైలి అని ఆమె అన్నారు. క్రమం తప్పకుండా పాటించే దినచర్య అలాగే జీవనశైలి తాను అందంగా ఉండటానికి సాయం చేస్తున్నాయని తెలిపింది. ప్రతి రోజు అంతా బాగుండాలని, సంతోషంగా ఉండాలని పాజిటివ్ థింకింగ్ తో లేస్తాను. ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు త్రాగి, ప్రెష్ అయిన తర్వాత 20 నుండి 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తాను అని తెలిపింది. అనంతరం, ఆమె ఒక గంట పాటు ధ్యానం చేయడం తప్పనిసరిగా పాటిస్తాను అని తెలిపారు.

ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి ధ్యానం కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆహారం విషయంలో, గత ఆరు నెలలుగా యమున ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తాను అని తెలిపారు. ఉదయం 10 గంటలకు తన మొదటి భోజనాన్ని తీసుకుంటారు. ఇదివరకైతే బ్రౌన్ రైస్, ఇడ్లీ, దోసె వంటివి తీసుకునేవారట. మధ్యాహ్నం పూట ఫ్రూట్స్, నట్స్, మజ్జిగ, కాఫీ వంటివి తీసుకుంటారు. రాత్రి భోజనాన్ని సాయంత్రం 6:00 నుండి 6:30 గంటల మధ్య పూర్తి చేస్తారు. ఒక ముద్ద మన ప్లేట్‌లోకి రావడానికి రైతులు పడే కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, అన్నం పట్ల కృతజ్ఞతతో తినడం వల్ల సాధారణ ఆహారం కూడా శరీరానికి పోషకంగా మారుతుందని ఆమె అన్నారు. పూర్వం కింద కూర్చుని భోజనం చేయడం, కాళ్లు మడిచి తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, ఆరోగ్యంగా ఉంటామని ఆమె గుర్తు చేశారు. షూటింగ్‌లలో తప్ప, ఇంట్లో మాత్రం తాను కిందే కూర్చుని భోజనం చేస్తానని వెల్లడించారు. తన పిల్లలు కూడా ఈ అలవాట్లను పాటిస్తున్నారని, కోవిడ్ సమయంలో కుటుంబమంతా కింద కూర్చుని తినడం అలవాటు చేసుకున్నారని యమున చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ వయసులోనూ అందుకే ఇంత అందంగా, ఫిట్‌గా ఉన్నా..
ఈ వయసులోనూ అందుకే ఇంత అందంగా, ఫిట్‌గా ఉన్నా..
చనిపోయినట్లు నటించి శత్రువులను బురిడీ కొట్టిస్తాయి.. ఈ జంతువుల..
చనిపోయినట్లు నటించి శత్రువులను బురిడీ కొట్టిస్తాయి.. ఈ జంతువుల..
ప్రపంచ రికార్డుతో హిట్‌మ్యాన్ రచ్చ వీడియో
ప్రపంచ రికార్డుతో హిట్‌మ్యాన్ రచ్చ వీడియో
అమెరికా Vs ఇరాన్ రణగర్జణ..ఏ క్షణమైనా బాంబుల వర్షం వీడియో
అమెరికా Vs ఇరాన్ రణగర్జణ..ఏ క్షణమైనా బాంబుల వర్షం వీడియో
ఈ టైంలో పండ్ల జ్యూస్‌ తాగారంటే.. ఒంట్లో విష పదార్ధాలు హాంఫట్‌!
ఈ టైంలో పండ్ల జ్యూస్‌ తాగారంటే.. ఒంట్లో విష పదార్ధాలు హాంఫట్‌!
బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్ని ప్రమాదం..!
బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్ని ప్రమాదం..!
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు తీవ్ర చలి వీడియో
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు తీవ్ర చలి వీడియో
కొంచెం తిన్నా కడుపు నిండుతుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ మటాష్ అయినట్లే
కొంచెం తిన్నా కడుపు నిండుతుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ మటాష్ అయినట్లే
హిమాలయాల్లో 'సిక్కిం సుందరి'..ముప్పై ఏళ్లకు ఒక్కసారి..వీడియో
హిమాలయాల్లో 'సిక్కిం సుందరి'..ముప్పై ఏళ్లకు ఒక్కసారి..వీడియో
థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు ఈ ఫుడ్స్ దివ్వ ఔషదం.. డైట్ ఆరోగ్యం మీ వ
థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు ఈ ఫుడ్స్ దివ్వ ఔషదం.. డైట్ ఆరోగ్యం మీ వ