వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందమా మీనాక్షి

Rajeev 

19 April 2026

మీనాక్షి చౌదరి.. తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది మీనాక్షి చౌదరి. ఈ యంగ్ బ్యూటీ వరుస సినిమాలతో దుమ్మురేపుతోంది. 

హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ రాణిస్తుంది అందాల భామ మీనాక్షి చౌదరి. 

యంగ్ హీరోల సరసన నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ అమ్మడు నటిస్తుంది. 

చివరిగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్ గా చేసింది. 

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ రెడీగాఉన్నాయి. 

మీనాక్షి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా గడుపుతుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆకట్టుకుంటుంది. 

నెట్టింట  క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.