టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ 

Rajeev 

19 April 2026

మృణాల్ ఠాకూర్ .. టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది. చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. 

సీతారామం సినిమాతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. 

దాంతో ఈ అమ్మడికి తెలుగులో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. 

ఇక ఆతర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మృణాల్ స్పీడ్ కు బ్రేకులేసింది. 

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మృణాల్ చిన్న గ్యాప్ తీసుకుంది. మధ్యలో కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. 

రీసెంట్ గా డెకాయిట్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది మృణాల్ ఠాకూర్. ఇప్పుడు మృణాల్ నెక్ట్స్ సినిమా పై ఆడియన్స్ కు ఆసక్తి పెరిగింది.