AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara: దేవర సెట్లో వారణాసి మూవీ షూటింగ్

Devara: దేవర సెట్లో వారణాసి మూవీ షూటింగ్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 19, 2026 | 12:08 PM

Share

దేవర సినిమా హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం భారీగా ట్రెండ్ అవుతోంది. జాన్వీ, మహేష్, జక్కన్న వంటి స్టార్ల మద్దతు, దేవర పార్ట్ 2పై మేకర్స్ పెంచుతున్న హైప్, అలాగే వారణాసి షూట్‌తో పాటు తారక్ లుక్‌పై జాన్వీ కామెంట్ వంటివి ఈ సినిమాను వార్తల్లో నిలుపుతున్నాయి. పార్ట్ 2లో ఎన్టీఆర్ బీస్ట్ అవతార్ అంచనాలను మరింత పెంచుతోంది.

దేవర సినిమా హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు యమాగా ట్రెండ్‌ అవుతోంది. ఓ వైపు జాన్వీ, ఇంకో వైపు మహేష్‌ అండ్‌ జక్కన్న.. అందరూ కలిసి కొరటాల సినిమాకు చాలానే హెల్ప్ చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు దేవర ఎందుకు ట్రెండ్‌ అవుతున్నట్టు? వీళ్లందరూ ఎందుకు సాయం చేస్తున్నట్టు? ఫస్ట్ పార్టులోమీరు చూసింది జస్ట్ ఫియరే. పవర్‌ అండ్‌ రివెంజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలంటే సెకండ్‌ పార్టుని అస్సలు మిస్‌ కాకూడదంటూ దేవర సీక్వెల్‌ మీద హైప్‌ పెంచేస్తున్నారు మేకర్స్. దీనికి తోడు దేవర సెట్స్ లో వారణాసి షూట్‌ అంటూ మరో వార్త వైరల్‌ అవుతోంది. దేవరలో అండర్‌ వాటర్‌ సీక్వెన్స్ కోసం వేసిన సెట్లో ఇప్పుడు మహేష్‌ వారణాసి షూటింగ్‌ జరుగుతుందన్నది న్యూస్‌. కొరటాల చేసిన సెట్టింగ్‌ని జక్కన్న ఎఫిషియంట్‌గా వాడుకుంటున్నారంటున్నారు ఫిల్మ్ నగర్‌ జనాలు. ఓ వైపు వారణాసి వార్తలతో దేవర వైరల్‌ అవుతోంటే, మరోవైపు తారక్‌ లేటెస్ట్ లుక్‌కి జాన్వీ పెట్టిన కామెంట్‌ కూడా వైరల్‌ అవుతోంది. దేవరకి తంగం మామూలు సపోర్ట్ చేయడం లేదంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తు్న్న నీల్‌ సినిమా పూర్తయితేగానీ, దేవర సీక్వెల్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేయరు తారక్‌. ఫస్ట్ పార్టుతో పోలిస్తే సెకండ్‌ పార్టులో తారక్‌ బీస్ట్ అవతార్‌ కనిపిస్తుందనే హోప్స్ కూడా భీభత్సంగా ఉన్నాయి. సో ఆఫ్టర్‌ నీల్‌ మూవీ, ఈ సినిమా కోసం తారక్‌ మేకోవర్‌కి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి

Srelelela: టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు

Salman Khan: వంశీ పైడిపల్లి మీదే హోప్స్ పెట్టుకున్న భాయీజాన్‌

స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..

సామాన్య పాస్టర్‌ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

Follow Us