AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srelelela: టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు

Srelelela: టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 19, 2026 | 11:50 AM

Share

శ్రీలీల కెరీర్, కీర్తి నిర్వహణపై తన ఆలోచనలను పంచుకున్నారు. లెర్నింగ్, అన్‌లెర్నింగ్, రీలెర్నింగ్ ద్వారా విజయం సాధించవచ్చని, మెడిసిన్-సినిమాను ఎలా బ్యాలెన్స్ చేశారో వివరించారు. మరోవైపు, త్రిష గురించి ఆర్.జె.బాలాజీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సూర్యతో ఆమె 'కరుప్పు' సినిమాకు సిద్ధమవుతుండగా, త్రిష పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని మేకర్స్ అంటున్నారు.

మనం చాలా సార్లు అనుకున్నాం కదా.. వైరల్‌ కావాలంటే అస్తమానం మనమే నోరు విప్పి మాట్లాడాల్సిన పని లేదు… కొన్నిసార్లు మన గురించి ఎవరో ఎక్కడో మాట్లాడిన మాటలు కూడా వైరల్‌ అవుతుంటాయీ అని.. కొన్నిసార్లు మనమే మాట్లాడినా.. పాత విషయాలను ప్రస్తావించినా చాలు.. అలా వైరల్‌ అవుతుంటాయి అంతే… ఇప్పుడు త్రిష గురించి మరెవరో మాట్లాడినట్టు.. పాత విషయాలతో శ్రీలీల ట్రెండ్‌ అవుతున్నట్టు… చుట్టూ ఎన్ని విషయాలున్నా సరే, లెర్నింగ్‌, అన్‌ లెర్నింగ్‌, రీ లెర్నింగ్‌.. ఈ మూడు విషయాల మీద మనకు క్లారిటీ ఉంటే చాలు… ఎంతటి క్లమ్సీనెస్‌నైనా దారిలో పెట్టేయొచ్చు అని అంటున్నారు శ్రీలీల. తాను మెడిసన్‌నీ, సినిమానీ అలాగే బ్యాలన్స్ చేశానని అంటున్నారు. సడన్‌గా వచ్చిన ఫేమ్‌ని హ్యాండిల్‌ చేయడంలోనూ తాను ఓ పద్ధతిని అనుసరించానని అంటున్నారు మిస్‌ లీల. విల్‌పవర్‌, పేషన్స్ ఉన్నప్పుడు మనకు సాధ్యం కానివి ఏవీ లేవంటారీ బ్యూటీ. మైండ్‌ స్విచ్‌ ఆన్‌ అండ్‌ ఆఫ్‌ చేసుకోగలిగిన వారికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదన్నారు. తాను గో త్రూ అయిన విషయాలను శ్రీలీల చెబుతుంటే ఆసక్తిగా షేర్‌ చేసుకుంటున్నారు నార్త్ జనాలు. నార్త్ లో శ్రీలీల ఎంత వైరల్‌ అవుతున్నారో, ఇప్పుడు సౌత్‌లో త్రిష గురించి ఆర్‌.జె.బాలాజీ చెప్పిన న్యూస్‌ కూడా సేమ్‌ టు సేమ్‌ వైరల్‌ అవుతోంది. తాను గతంలోనే త్రిషతో ఓ సినిమా చేయాలనుకున్నానని, అప్పుడు కుదరలేదని, ఇప్పుడు కరుప్పు స్క్రిప్ట్ చెప్పగానే ఓకే చేసేశారని అంటున్నారు ఆర్‌.జె.బాలాజీ. సూర్య, త్రిష కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా అనౌన్స్ మెంట్‌ టైమ్‌లోనే అర్థమైందని చెప్పారు కెప్టెన్‌. ఈ ఏడాది ఇప్పటికే విశ్వంభరతో పలకరించాల్సింది త్రిష. కానీ, ఆ సినిమా డేట్‌ ఇంకా రివీల్‌ కాలేదు. 2026ని కరుప్పుతో బోణీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీలో జస్ట్ సూర్య అండ్‌ త్రిష కాంబో మాత్రమే కాదు, త్రిష కేరక్టర్‌ కూడా చాలా స్పెషల్‌గా ఉంటుందన్నది మేకర్స్ పదే పదే చెబుతున్న మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salman Khan: వంశీ పైడిపల్లి మీదే హోప్స్ పెట్టుకున్న భాయీజాన్‌

స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..

సామాన్య పాస్టర్‌ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

Srikalahasti: పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ

Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. ఆసియాలోనే నెం.1

Follow Us