AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikalahasti: పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ

Srikalahasti: పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ

Phani CH
|

Updated on: Apr 19, 2026 | 11:38 AM

Share

శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజల విధానంలో ధర్మకర్తల మండలి మార్పులు చేసింది. పేదల కోసం రూ.100కే పూజను అందుబాటులోకి తెచ్చింది, రూ.500 పూజను రద్దు చేసింది. కొన్ని పూజల ధరలను సవరించింది. భక్తుల సౌకర్యార్థం, ఆలయ అభివృద్ధికి సంబంధించి వాహన మండపం ఆధునీకరణ, ఇతర 21 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజల విధానంలో ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆలయ అభివృద్ధే లక్ష్యంగా భక్తుల సౌకర్యార్థం, పలు మార్పులకు ఆమోదం తెలిపారు. ధర్మకర్తల మండలి నిర్ణయాల్లో భాగంగా..పేద భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రయోగాత్మకంగా రూ.100 కే రాహు-కేతు పూజలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన నియోజకవర్గ పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి బుధవారం సుమారు 2 వేల మందిని ఈ పూజలకు అనుమతిస్తారు. ఇందులో వెండి సర్పాలు ఉండవు, కేవలం పూజా సామగ్రితోనే క్రతువు నిర్వహిస్తారు. మార్కెట్‌లో వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, గతంలో ఉన్న రూ.500 రాహు-కేతు పూజలను రద్దు చేశారు. అలాగే, రూ.750, రూ.1500, రూ.2500 పూజలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్న రూ.5 వేల టికెట్ ధరను రూ.6 వేలకు పెంచారు. దక్షిణమూర్తి అభిషేకం టికెట్ ధరను ఒక్కరికి రూ.500గా నిర్ణయించారు. పూజలతో పాటు ఆలయ అభివృద్ధిపై కూడా మండలి దృష్టి సారించింది. వాహన మండపం ఆధునీకరణ, ఈవో మరియు ట్రస్టు బోర్డు సభ్యులకు క్వార్టర్ల నిర్మాణం, పానగల్ నుంచి రామసేతు వంతెన వరకు పచ్చదనం పెంపు వంటి 21 అంశాలకు ఆమోదం తెలిపారు. అలాగే కందాడలోని శివాలయం, కన్నలిలోని వీరభద్రస్వామి ఆలయాలను శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా చేర్చుకోనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. ఆసియాలోనే నెం.1

గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది

సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. ఇంటర్ బోర్డు‌కు విద్యార్థి ఫోన్ కాల్

Follow Us