AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కిలో ఉప్పు ప్యాకెట్‌లో ఎన్ని రేణువులు ఉంటాయి..? ఈ లెక్క చూస్తే బిత్తరపోవడం పక్కా..

ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? సినిమా చూస్తాం లేదా కబుర్లు చెప్పుకుంటాం. కానీ ఈ నలుగురు మిత్రులు మాత్రం ఏకంగా ఉప్పు ప్యాకెట్‌ను విప్పి లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఒక రోజు కాదు.. ఏకంగా 9 రోజులు.. అసలు ఒక కిలో ఉప్పులో ఎన్ని గింజలు ఉంటాయో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Video: కిలో ఉప్పు ప్యాకెట్‌లో ఎన్ని రేణువులు ఉంటాయి..? ఈ లెక్క చూస్తే బిత్తరపోవడం పక్కా..
How Many Grains Are In 1 Kg Of Salt
Krishna S
|

Updated on: Apr 19, 2026 | 4:14 PM

Share

వంటింట్లో ఉప్పు లేనిదే ఏ వంటా రుచించదు. ప్రాణం లేని కూరకైనా ప్రాణం పోసే శక్తి ఉప్పుకు ఉంది. అయితే మనం రోజూ వాడే ఒక కిలో ఉప్పు ప్యాకెట్‌లో ఎన్ని రేణువులు లేదా గింజలు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వెర్రి ప్రశ్నకే సమాధానం వెతకాలని ఫిక్స్ అయ్యారు కొందరు యువకులు. వారు చేసిన ఈ సాహసోపేతమైన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం.. నలుగురు స్నేహితులు ఒక కిలో ఉప్పు ప్యాకెట్‌ను తీసుకుని, టేబుల్‌పై వేసి లెక్కించడం మొదలుపెట్టారు. ఉప్పు గింజలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వాటిని విడదీయడం, లెక్కించడం అసాధ్యమైన పని అని మనందరికీ తెలుసు. కానీ ఆ యువకులు మాత్రం పట్టు వదలకుండా వరుసగా 9 రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి ఒక్కొక్క గింజను లెక్కించారు.

లెక్క తేలింది ఇలా..

ఆ నలుగురు స్నేహితుల సుదీర్ఘ లెక్కింపు తర్వాత కిలో ఉప్పు ప్యాకెట్‌లో 1,42,13,753 అంటే కోటి నలభై రెండు లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై మూడు రేణువులు ఉన్నట్లు తేలింది. వారు 100 గ్రాముల ఉప్పును లెక్కించినప్పుడు సుమారు 13.75 లక్షల గింజలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన కిలోకు 1.37 కోట్లు ఉండాలి.. కానీ గింజల పరిమాణంలో తేడాల వల్ల కిలో ప్యాకెట్‌లో మరో 5 లక్షల గింజలు అదనంగా ఉన్నాయి.

నిపుణులు ఏమంటున్నారు..?

అయితే, ఈ సంఖ్యను ప్రామాణికంగా తీసుకోలేమని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అన్ని ఉప్పు గింజలు ఒకే పరిమాణంలో ఉండవు. టేబుల్ సాల్ట్ గింజ పరిమాణం సాధారణంగా 0.3 నుండి 0.5 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. గింజలు మరీ చిన్నవిగా ఉంటే ఒక కిలోలో 5 కోట్లు నుండి 8 కోట్లు వరకు గింజలు ఉండే అవకాశం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.

వైరల్ అవుతున్న ప్రయోగం

ఏది ఏమైనా ప్రపంచం గమనించని ఒక చిన్న విషయాన్ని ఇంత ఓపికగా లెక్కించిన ఆ నలుగురు స్నేహితుల సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘సాధ్యం కాదు అనుకున్న దాన్ని కూడా పట్టుదలతో చేసి చూపించారు’’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by On The Way (@ondw.ay)

Follow Us