AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరంజీవి.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..

తన సోదరుడు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. త్వరగా కోలుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరంజీవి.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..
Pawan Kalyan, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2026 | 4:25 PM

Share

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. పవన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన అవసరం లేదనన్నారు చిరు. పవన్‌ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌ కల్యాణ్ సాధారణ స్థితికి రావడానికి సుమారు వారం రోజుల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించినట్లు చిరంజీవి తెలిపారు. “కల్యాణ్ బాబు ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకుంటున్నారు” అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

పవన్‌ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్పందించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్: “ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ గారు పూర్తిగా కోలుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరలోనే పూర్తి శక్తితో తిరిగి రావాలి” అని ట్వీట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

జూనియర్ ఎన్టీఆర్: “పవన్‌ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన పునరుత్తేజంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. వీరితో పాటు సాయి దుర్గా తేజ్, కోన వెంకట్ వంటి ప్రముఖులు కూడా పవన్‌ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

గత శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు శనివారం సాయంత్రం ఆయనకు చిన్నపాటి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పవన్‌ కల్యాణ్‌కు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

Follow Us