సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. అదృష్టం దూరమవుతుంది జాగ్రత్త!
మకర సంక్రాంతి రోజున జరిగే చిన్న పొరపాటు కూడా ఏడాది మొత్తం ప్రభావం చూపుతుందని నమ్మకం. ఈ పవిత్ర దినంలో కొన్ని పనులను నివారించాల్సిందిగా శాస్త్రాలు సూచిస్తున్నాయి. అందువల్ల మకర సంక్రాంతి రోజున తప్పనిసరిగా పాటించాల్సిన ఐదు ముఖ్యమైన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిపెద్ద పండగ. నాలుగు రోజులపాటు జరుపుకునే ఈ పండగ సమయంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. అయితే, మకర సంక్రాంతి రోజున చేసే చిన్న పొరపాటు కూడా ఏడాది పొడవునా ప్రభావం చూపుతుంది. మకర సంక్రాంతి రోజున చేయకూడని కొన్ని పనులు, చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో ఐదు ముఖ్యమనవి ఉన్నాయి.
దక్షిణం వైపు ప్రయాణించడం మానుకోండి
మకర సంక్రాంతి రోజునాడు దక్షిణ దిశలో ప్రయాణించడం శుభప్రదం కాదు. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు. దక్షిణ దిశలో ప్రయాణించడం సూర్యుని సానుకూల శ్యక్తికి వ్యతిరేకం అని పరిగణిస్తారు. అలాంటి ప్రయాణం ఆర్థిక నష్టం, పనిలో అంతరాయం లేదా అవాంఛిత ఇబ్బందులకు కారణమవుతుంది. మీరు అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే.. ముందుగా సూర్యుడికి నీటిని సమర్పించి.. ‘ఓం సూర్యాయనమ:’ అని జపించండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రోజున ఉత్తరం లేదా తూర్పు దిశలో ప్రయాణించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
నల్ల నువ్వులను దానం చేయొద్దు
సంక్రాంతి రోజున నువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కానీ, ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం నిషిద్ధంగా పరిగణిస్తారు. నల్ల నువ్వులు శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే, మకర సంక్రాంతి రోజున సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నల్ల నవ్వులను దానం చేయడం వల్ల సూర్యుడు, శని మధ్య అసమతుల్యత పెరుగుతుంది. ఇది డబ్బు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. బదులుగా తెల్ల నువ్వులు, బెల్లం, చక్కెర లేదా కిచిడి దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.
సంక్రాంతి నాడు ఇలాంటి ఆహారం తీసుకోవద్దు
మకర సంక్రాంతి రోజున శరీరం, మనస్సు రెండింటినీ స్వచ్ఛంగా ఉంచుకోవడం అవసరమని భావిస్తారు. ఈ రోజున మాంసాహారం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా భారీ ఆహారం తినకూడదు. సూర్యుడు సాత్విక శక్తికి చిహ్నం, తామస ఆహారం ఈ శక్తిని బలహీనపరుస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక శాంతి, ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.
కోపం, అసత్యానికి దూరంగా ఉండండి
ఈ పవిత్రమైన రోజున ప్రవర్తనలో ప్రత్యేక సంయమనం పాటించడం మంచిది. అబద్ధం చెప్పడం, కోపం తెచ్చుకోవడం లేదా ఎవరిపైనైనా ప్రతికూల భావాలు కలిగి ఉండటం అశుభంగా పరిగణిస్తారు. సూర్య దేవుడు సత్యం, వెలుగు, క్రమశిక్షణకు చిహ్నం. కాబట్టి మకర సంక్రాంతి రోజున దైవ స్మరణ చేస్తూ ప్రశాంతంగా ఉండండి. తీయగా మాట్లాడండి. సానుకూల ఆలోచనలను కలిగి ఉండండి. ‘ఓం ఘృత సూర్యనమ:’ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఏడాది పొడవునా సూర్యుని అనుగ్రహం చెక్కు చెదరకుండా ఉంటుంది.
దానం, పూజా పద్ధతులలో జాగ్రత్తగా ఉండండి
మకర సంక్రాంతి నాడు చేసే దానాలు చాలా ఫలవంతమైనవి. కానీ, దానము చేసే ఎంపిక సరైనదిగా ఉండాలి.ఈరోజున నల్లని వస్త్రాలు లేదా నల్ల నువ్వులను దానం చేయకూడదు. తెల్లని వస్త్రాలు, బెల్లం, నువ్వుల లడ్డు లేదా కిచిడీని దానం చేయడం మంచిదని భావిస్తారు. సూర్య భగవానునికి అర్ఘ్యం అర్పించేటప్పుడు.. ఎర్రచందనం, ఎరుపు పువ్వులు, బెల్లం వాడాలి. పూజా, దానధర్మాలు సంపదను కోల్పోవు.. కానీ, జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతాయి.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
