అమెరికా Vs ఇరాన్ రణగర్జణ..ఏ క్షణమైనా బాంబుల వర్షం వీడియో
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఏక్షణమైనా దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల అధ్యక్షులు వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఇరాన్ వీధుల్లో జరుగుతోన్న నిరసన ప్రదర్శనలు, ఖమేనీ పాలక యంత్రాంగం అణచివేతలు, ఇందులో తమ జోక్యానికి అమెరికా హెచ్చరికలతో ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్త దశను దాటి పోయింది. ఏ క్షణమైనా బాంబుల వర్షం కురింపించుకునే వాతావరణం ఏర్పడింది.
తమ దేశంలో సాగుతున్న నిరసనలను సాకుగా తీసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సేనలు దాడులకు దిగితే వాటిపై తమ సేనలు విరుచుకుపడుతాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా సేనలను గురిచేసుకుని దెబ్బతీస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌పై ఇక తమ తక్షణ చర్యలు తప్పవని అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా చేసిన హెచ్చిరకలపై ఇరాన్ పార్లమెంట్ ద్వారా ప్రతిచర్యకు ప్రకటన వెలువడింది. పశ్చిమాసియాలో ఉన్న US, ఇజ్రాయెల్ బేస్‌లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడులు జరిగిన మరుక్షణమే దాడులు చేస్తామని చెప్పింది. అంతకు ముందు ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంతోపాటు.. తమ మిలిటరీ ఇరాన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు ట్రంప్. బలమైన ఆప్షన్లను పరిశీలిస్తున్నాం అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు తీవ్ర చలి వీడియో
హిమాలయాల్లో 'సిక్కిం సుందరి'..ముప్పై ఏళ్లకు ఒక్కసారి..వీడియో
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
