AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..

అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..

Phani CH
|

Updated on: Mar 29, 2026 | 5:34 PM

Share

అమెరికాలోని మెంఫిస్‌లో 111 అడుగుల అన్నమయ్య మహా విగ్రహం నిర్మాణమవుతోంది. తెలుగు సాహిత్యానికి, భక్తి సంగీతానికి పట్టాభిషేకం చేసిన పదకవితా పితామహుడిగా అన్నమాచార్యులు విదేశీ గడ్డపై గౌరవం అందుకోనున్నారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో ఇండియన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ పంచలోహ విగ్రహాన్ని 2028 అన్నమయ్య జయంతికి ఆవిష్కరించనున్నారు, మెంఫిస్‌ను ప్రపంచ భక్తి కేంద్రంగా మార్చనుంది.

తెలుగు సాహిత్యానికి, భక్తి సంగీతానికి పట్టాభిషేకం చేసిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులకు విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కబోతోంది. అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో 111 అడుగుల ఎత్తైన అన్నమయ్య మహా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మెంపిస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. అమెరికాలోని తెలుగు వారు, ప్రవాస భారతీయుల సహకారంతో ఈ నిర్మాణం వేగంగా సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన ప్రముఖ శిల్పి పెనుగొండ కరుణాకర్ ఉడయార్ ఆధునిక 3D సాంకేతికతతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. సుమారు 75 టన్నుల పంచలోహాలతో తయారవుతున్న ఈ విగ్రహానికి పునాదిగా 160 టన్నుల ఉక్కు చట్రాన్ని ఉపయోగిస్తున్నారు. విగ్రహం భారీ పరిమాణంలో ఉన్నందున, వివిధ భాగాలను విడివిడిగా తయారు చేసి నౌకల ద్వారా అమెరికాకు తరలించనున్నారు. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన పాదాల తయారీ పూర్తయ్యింది. ప్రణాళిక ప్రకారం 2028 మే 9న అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ మహా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మెంపిస్ నగరం ప్రపంచవ్యాప్తంగా భారతీయ భక్తి సంప్రదాయానికి ఒక ముఖ్య కేంద్రంగా మారుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు

‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు

చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు

Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌

Follow Us