AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'చెడ్డీ గ్యాంగ్' కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు

‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు

Phani CH
|

Updated on: Mar 29, 2026 | 5:30 PM

Share

తిరుపతిలో చెడ్డీగ్యాంగ్ సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. డా. సునంద కుమార్ రెడ్డి నివాసంలో దొంగతనం యత్నం జరిగింది. సీసీటీవీలో గ్యాంగ్ కదలికలు రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు అప్రమత్తమవ్వడంతో చోరీ జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్, వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

చెడ్డీగ్యాంగ్‌ మరోసారి రెచ్చిపోయింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్‌లో నివసిస్తున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి నివాసంలో ఈ ముఠా చొరబడింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి సుమారు 2:20 గంటల సమయంలో ముగ్గురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ డాక్టర్ నివాసానికి చేరుకుంది. ఇద్దరు బయట కాపలా ఉండగా, ఒక దొంగ మాత్రం ఇంట్లోకి చొరబడ్డాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే తచ్చాడాడు. విలువైన వస్తువుల కోసం గాలించాడు. మూడు బెడ్‌రూముల్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు అప్రమత్తమవ్వడంతో, ఏమీ దొరక్కముందే సదరు ముఠా అక్కడి నుంచి పరారైంది. బాధితుడు సునంద కుమార్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించడంతో పాటు, పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి సొత్తు చోరీకి గురికాలేదని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ముఠా ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు

Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌

యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!

రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?

Follow Us