రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?
రిషబ్ శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో రుక్మిణి వసంత్, హోంబలే ఫిల్మ్స్, రాజ్ బి. శెట్టిలను అన్‌ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 'జై హనుమాన్' సినిమా కోసం నిష్టగా ఉన్న రిషబ్‌కు, వారికి మధ్య విభేదాలు వచ్చాయా లేదా ఇది సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ సడన్ సోషల్ మీడియా మూవ్‌పై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూర్వం ఎవరైనా ఇద్దరు సెలబ్రిటీలు, ముఖం ముఖం చూసుకోకుండా.. తల తిప్పుకొని వెళ్లయినా సరే, లేదా.. ఒకరికొకరు మాట్లాడుకోకుండా మూతి మూడుకుని కూర్చున్నా సరే.., వారిద్దరి మధ్య పడడం లేదనే విషయం అందరికీ తెలిసేది. కానీ ఇప్పుడు అలా కాదు.. జస్ట్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో కొడfతే చాలు.. విషయం అర్థం అవుతోంది. దాంతో పాటే సోషల్ మీడియాలో ఆ స్టార్స్ కు సంబంధించిన పలు వార్తలు రావడం షురూ అవుతోంది. ఇప్పుడు రిషబ్ షెట్టి.. రుక్మిణి వసంత్.. హోంబలే ప్రొడక్షన్ హౌస్ గురించి కూడా ఇలాంటి వార్తే ఒకటి వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి! కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ షెట్టి.. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. జై హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్ర కోసం తన శరీరాకృతిని మార్చుకుని.. ఎంతో నిష్టగా ఆ సినిమా కోసం పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈయన హీరోయిన్ రుక్మిణి వసంత్‌ను.. తన ఇన్‌స్టాలో అన్‌ఫాలో కొట్టాడు. ఒక్క రుక్మిణీ వసంత్‌నే కాదు.. హోంబలే ఖాతాను అన్‌ఫాలో చేశారు. దీంతో అసలు ఏం జరుగుతోంది అంటూ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. హీరోయిన్, నిర్మాణ సంస్థనే కాదు, తన అత్యంత సన్నిహితుడైన కన్నడ నటుడు రాజ్ బి. శెట్టిని కూడా రిషబ్ శెట్టి అన్‌ఫాలో చేశాడు. దాంతో కన్నడ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? రిషబ్ శెట్టికి నిర్మాణ సంస్థకు ఏమైనా చెడిందా? అంటూ చర్చ మొదలైంది నెట్టింట. షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏవైనా విభేదాలు తలెత్తాయా లేక ఇది ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి
Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

