AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు

తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు

Phani CH
|

Updated on: Mar 29, 2026 | 5:32 PM

Share

టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ బుకింగ్‌లో భక్తుల ఇబ్బందులను తొలగించడానికి సరికొత్త 'సింగిల్ ట్రాన్సాక్షన్' విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో విరాళం, దర్శనం టికెట్ వేర్వేరుగా చెల్లించే పద్ధతిని మార్చి, ఇకపై రూ. 10,500 (విరాళం రూ.10,000 + టికెట్ రూ.500) ఒకేసారి చెల్లించవచ్చు. ఇది సాంకేతిక సమస్యలను అధిగమించి, సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 800 కరెంట్ బుకింగ్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్లు పొందే విధానంలో భక్తులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ సరికొత్త మార్పులు చేపట్టింది. విరాళం, దర్శనం టికెట్లకు సంబంధించి ఇకపై ‘సింగిల్ ట్రాన్జాక్షన్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. గతంలో భక్తులు మొదట శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10,000 విరాళం చెల్లించి, ఆ తర్వాత దర్శనం కోసం రూ. 500 టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఈ ప్రక్రియలో విరాళం చెల్లింపు పూర్తయినా, దర్శనం టికెట్ కన్ఫర్మ్ అయ్యేలోపు కోటా ముగిసిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. డబ్బులు కట్ అయి, టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ, విరాళం రూ.10,000, టికెట్ ధర రూ.500 కలిపి మొత్తం రూ.10,500 ఒకేసారి చెల్లించేలా మార్పులు చేసింది. ప్రతీ రోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ కింద 800 టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఒక లావాదేవీలో గరిష్టంగా నలుగురు భక్తులకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ చెల్లింపుల ప్రక్రియ కోసం యూనియన్ బ్యాంక్‌తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. యూపీఐ , డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, కేవలం ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో మాత్రమే ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల భక్తులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, సాంకేతిక సమస్యలను అధిగమించవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు

చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు

Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌

యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!

Follow Us