Cinema: ఏం సినిమా మావ.. ఓటీటీలో దుమ్మురేపుతుంది.. థియేటర్లకు మించి రెస్పాన్స్..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండగ సినిమాల హావా నడుస్తుంది. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు సినిమాలు పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఓ మూవీ పేరు మారుమోగుతుంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండగ సినిమాల సందడి కొనసాగుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఓ సినిమా పేరు మారుమోగుతుంది. అలాగే ఇందులో హీరోగా నటించిన కృష్ణ బురుగుల పేరు యూత్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. ఇప్పుడు అతడి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిదా అయ్యాను బ్రో నీ నటనకు.. ఏం చేశావ్ భయ్యా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ యూత్ అంతగా కనెక్ట్ అయిన సినిమా ఏంటో తెలుసా.. ? అదే జిగ్రీస్. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు దూసుకుపోతుంది. ఇందులో కృష్ణ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడా కూడా హీరోయిజం లేకుండా కథలో భాగంగానే సహజ నటనతో మెప్పించాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు జిగ్రిస్. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో చూడొచ్చు.
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
యూత్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కృష్ణ బురుగుల కామెడీకి ఫిదా అయిపోతున్నారు. సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ, ‘జిగ్రిస్’ తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
