Manchu Manoj: సంక్రాంతి స్పెషల్.. మంచు మనోజ్ బ్రాండ్ ఫిల్మ్ చూశారా?
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ మధ్యన సినిమాలతో పాటు టీవీ షోలతోనూ సందడి చేస్తున్నాడు. గతంలో అతను ఓ టీవీ షోక హోస్ట్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఓ బ్రాండ్ ఫిల్మ్ తో మన ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించిన బ్రాండ్ ఫిల్మ్‌ను తెలుగు జీ 5 ఆవిష్కరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల కోసం దీన్ని రూపొందించారు. ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయత అంతా ఘనంగా ప్రతిబింబిస్తోంది. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తామనే జీ5 హామీ మరింత ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘మన పండగ, మన ఎంటర్టైన్మెంట్, మన తెలుగు జీ5’ అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ క్యాంపెయిన్, ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియజేస్తోంది.సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా రూపొందించిన సంప్రదాయ గ్రామీణ మండువ ఇంటి సెట్‌లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను గమనిస్తే.. సంక్రాంతి పండుగకి అల్లుడు (మంచు మనోజ్) ఊరుకి వస్తుంటాడు. బస్సులో టికెట్ కండెక్టర్ అందరికీ కొరియన్ సినిమా చూపెడుతుంటాడు. అదెవరికీ అర్థం కాకుండా బాధపడుతుంటారు. అప్పుడు మనోజ్.. ఆ డ్రైవర్‌ను పేరు సుబ్బరావు అయితే అప్పారావు అనిపిలుస్తాడు. ‘ఎన్ని సార్లు చెప్పాలి సర్.. నా పేరు సుబ్బారావు అని, అప్పారావు కాద’ని అంటాడు. ‘నువ్వు చెప్పింది నాకు అర్థమైంది.. కానీ నువ్వు పెట్టిన సినిమానే మాకు అర్థం కాలేదు. మన పండగంటే మన ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలంటూ’ మనోజ్ చెప్పి తన ఫోన్‌లో ఉండే జీ 5 యాప్‌ను చూపెడతాడు. బస్సులో అంతా సంక్రాంతి సందడి నెలకొంటుంది.
ఇంటికెళ్లగానే..భార్యతో మన శంకర వర ప్రసాద్‌గారు సినిమాలోని శశిరేఖ.. పాటను పాడతాడు. దానికి భార్య అతని హుషారు చూసి ‘ఏంటి బాస్ సంగతి’ అనగానే.. ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూనే మన పండగకి మన ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలిగా అని అంటాడు. సరదాగా చిన్న పిల్లలతో ఆడుకుంటూనే మావయ్యలు, అత్తయ్యలను ఆట పట్టిస్తుంటాడు. అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌ను చూపిస్తూ కుటుంబం అంతా కలిసి మన శంకర వర ప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు.
ఇది మన పండగ..మన ఎంటర్టైన్మెంట్..మన తెలుగులో జీ5
దీంతో జీ 5లో మన శంకర వర ప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు కూడా రాబోతున్నాయని హింట్ ఇచ్చారు. అలాగే బ్రాండ్ ఫిల్మ్‌లో పండుగ సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగం, ఆత్మీయత, సునిశితమైన హాస్యాన్ని ఆవిష్కరించారు. ఇందులోని కథను గమనిస్తే.. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన గ్రామానికి బస్సులో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. మధ్యలో మనకు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన హాస్యభరితమైన సందర్భాలు, సరదాగా సాగిన చర్చలను పరిచయం చేస్తారు. కథ చివరలో ఎనర్జిటిక్ సెలబ్రేషన్స్‌ను చూపిస్తారు. ఇలా చూపించటం ద్వారా జీ 5 ఈ ఏడాదంతా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందనే విషయాన్ని తెలియజేశారు.
ఈ బ్రాండ్ ఫిల్మ్‌కు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. పాపులర్ మూవీ లిటిల్ హార్ట్స్‌కు వర్క్ చేసిన సూర్య బాలాజీ కెమెరామెన్‌గా వర్క్ చేశారు. ఇది పండుగ స్మృతులను, ఆధునికమైన పద్ధతిలో చెప్పేలా దీన్ని రూపొందించారు. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు, సిరీస్‌లతో అత్యున్నతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించటంలో జీ 5 ఎప్పుడూ ముందుంటోంది. ఇప్పటికే నయనం, భైరవం, సంక్రాంతికి వస్తున్నాం, కిష్కింధపురి, హను మాన్ వంటి హిట్ కంటెంట్‌తో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. రాబోయే రోజుల్లోజీ5 మరింతగా ప్రేక్షక ఆదరణ పొందేలా సినిమాలను అందించనుంది. ఇందులో చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు, రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, గుర్రం పాపిరెడ్డ వంటి సినిమాలున్నాయి. ఇలాంటి చిత్రాలతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు అందించటంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది జీ 5.
ఈ సందర్బంగా తెలుగు జీ 5, బిజినెస్ హెడ్ అనురాధ గురు మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని, వైవిధ్యమైన ఎంటర్‌టైన్మెంట్‌ను అందించటమే మా ప్రధాన లక్ష్యం. సంప్రదాయ కుటుంబ కథల నుంచి పండుగ థీమ్ ఉన్న ఎంటర్‌టైనర్స్, ఆసక్తిని రేకెత్తించే థ్రిల్లర్స్, స్టార్ హీరోలకు సంబంధించిన బడా ప్రాజెక్ట్స్ ఇలా అన్నీ రకాల కంటెంట్‌ను అందిస్తున్నాం, చిరంజీవి, నయనతార సినిమా, రవితేజ నటించిన సినిమాలతో స్టార్స్‌కు సంబంధించిన బలమైన కంటెంట్‌ను రూపొందిస్తున్నాం. ఈ సంక్రాంతి క్యాంపెయిన్ జీ 5 విలువలను ప్రతిబింబిస్తోంది. రూటెడ్ స్టోరీస్, మాస్, వినోదం, ఇలా కుటుంబం అంతా కలిసి ఆస్వాదించే కంటెంట్ జీ5 సొంతం’’ అన్నారు.
సంక్రాంతి క్యాంపెయిన్‌లో ప్రధాన భూమికను పోషించిన మంచు మనోజ్ మాట్లాడుతూ ‘‘సంక్రాంతి అంటేనే కుటుంబం. ఇందులో భాగం కావటం వల్ల.. నేను ఇది వరకు ఫన్నీగా, సరదాగా నవ్వుకునేలా చేసిన పాత్రలన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఆ ఫీలింగ్‌ను పొందటం చాలా కొత్తగా ఉంది. పండుగ వాతావరణాన్ని ఇందులో సహజంగా చిత్రీకరించారు. ఇలా కుటుంబ భావాలను సెలబ్రేట్ చేసే జీ5 తెలుగు క్యాంపెయిన్‌లో భాగమవడం మరింత ప్రత్యేకంగా అనిపించింది’’ అన్నారు.
మన సంస్కృతికి సంబంధించిన రూటెడ్ స్టోరీస్‌ను చెప్పటం, బలమైన కంటెంట్ లైనప్, పండగ కాన్సెప్ట్ ఉన్న బ్రాండ్ కమ్యూనికేషన్ ద్వారా తెలుగు ZEE5 అన్ని రూపాల తెలుగు వినోదాన్ని సెలబ్రేట్ చేసే ప్లాట్‌ఫారంగా తన స్థానాన్నితెలుగు ప్రేక్షకుల గుండెల్లో మరింత పదిలపరుచుకుంటోంది. అందులో భాగమైన ఈ సంక్రాంతి తెలుగు ప్రేక్షకుల కోసం మరింత ప్రత్యేకంగా మారింది.
ZEE5 గురించి…
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 4071 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1800 టీవీ షోలు, 422కు పైగా ఒరిజినల్స్, 1.35 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.
