Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geet Saini: ఆ నటిలా పేరు తెచ్చుకోవాలని ఉంది.. ‘పుష్పక విమానం’ హీరోయిన్ గీత్ సైని ఆసక్తికర వ్యాఖ్యలు

Pushpaka Vimanam: "పుష్పక విమానం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయవుతున్న మరో యువ నటీమణి గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన..

Geet Saini: ఆ నటిలా పేరు తెచ్చుకోవాలని ఉంది.. ‘పుష్పక విమానం’ హీరోయిన్ గీత్ సైని ఆసక్తికర వ్యాఖ్యలు
Geet Saini
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 12, 2021 | 12:06 PM

Pushpaka Vimanam Movie: “పుష్పక విమానం” చిత్రంతో తెలుగు తెరకు పరిచయవుతున్న మరో యువ నటీమణి గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి అనే క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. మీనాక్షి అనే క్యారెక్టర్‌లో నటించడం, ఆ మూడ్‌లో ఉండిపోవడానికి చాలా కష్టపడ్డానని చెబుతోంది గీత్ సైని. “పుష్పక విమానం” సినిమా చూస్తే నాయికగా తన ఎఫర్ట్ తెలుస్తుందని అంటోంది. ఇవాళ రిలీజ్ అయిన “పుష్పక విమానం” చిత్రంలో నటించిన ఎక్సీపిరియన్స్ ను మీడియాతో పంచుకుందీ యంగ్ హీరోయిన్.

గీత్ సైని మాట్లాడుతూ…కాలేజ్ డేస్ నుంచి నాకు డాన్సులు చేయడం అంటే చాలా ఇష్టం. డాన్సులతో పాటు తెలుగు కామెడీ చిత్రాలు చూడటం ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. నేను సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని అనుకోలేదు. పుష్పక విమానం సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, నా స్నేహితురాలు ఒకరు నా ఫొటోస్ పంపింది. ఆడిషన్ చేసినప్పుడు మీనాక్షి క్యారెక్టర్ కు నేను బాగా సరిపోతాని దర్శకుడు దామోదర సెలెక్ట్ చేశారు.

మీనాక్షి చిట్టిలంక సుందర్ వైఫ్. తను పెళ్లయ్యాక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీనాక్షి క్యారెక్టర్‌లో నటించడం అంత సులువు కాదు. ఎప్పుడూ ఒక మూడ్‌లో ఉండాల్సి వచ్చేది. సెట్‌లో ఎవరైనా జోక్ వేసినా.. నా మూడ్‌లోనే ఉండేందుకు అస్సలు రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. అలా మీనాక్షి క్యారెక్టర్‌ను ప్లే చేశాను. పుష్పక విమానం చూశాక ఆడియెన్స్ నా క్యారెక్టర్ ను ఇష్టపడతారు. ఆనంద్ చాలా మంచి వ్యక్తి. షూటింగ్ టైమ్ లో చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. నా కెరీర్ లో ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా మరో ప్రాజెక్ట్ చేయొద్దని, వచ్చిన కొన్ని ఆఫర్స్ కూడా వదులుకున్నాను. సాయి పల్లవిలా డాన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేయాలని ఉందని గీత సైని చెప్పింది.

Also Read..

Tiger: నల్లమల అటవీ ప్రాంతంలో.. గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత..

డ్రాగన్‌ ఓవర్‌ యాక్షన్‌.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ గ్రామాన్ని నిర్మించిన చైనా.!